మొదటిసారి రిలీజ్ కంటే కూడా రీ రిలీజ్ లో ఎక్కువ బిజినెస్ సాధించిన 7 సినిమాలు…

Ads

శాటిలైట్, డిజిటల్ ఎంట్రీలు రాకముందు రీ రిలీజ్ జోరు చాలా ఎక్కువగా ఉండేది.ఆ తర్వాత ఓటీటీ పుణ్యమా అని రీ రిలీజ్ అయ్యే మూవీస్ సంఖ్య చాలా వరకు పడిపోయింది.మళ్ళీ తిరిగి ఇన్ని రోజులకు హీరోల బర్త్డే అని ఇంకేదైనా ఈవెంట్ అని పాత సూపర్ హిట్ చిత్రాలు రీ రిలీజ్ చేయడం కామన్ అయిపోయింది.ఈ మథ్య కాలంలో పాత మూవీస్ ను రీ మాస్టర్ చేసి 4Kలో మరోసారి విడుదల చేయటం పరిపాటిగా మారింది.

ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, బిల్లా, చెన్నకేశవ రెడ్డి, ఖుషీ,సింహాద్రి, తొలిప్రేమ, బిజినెస్ మేన్ ఇలా ఒకప్పటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఆ హీరోల బర్త్డే సందర్భంగా రీ రీలీజ్ చేయడం జరిగింది. ఊహించని విధంగా ఈ చిత్రాలు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి. మరి ఏ మూవీ టాప్ డే 1 రీ రిలీజ్ రికార్డ్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఒక లుక్ వేద్దాం..

బిజినెస్ మేన్

మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన బిజినెస్ మాన్ రీ రిలీజ్‌లో మొదటి రోజు రూ. 5.3 కోట్ల గ్రాస్ ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లను రాబట్టింది.

ఖుషీ

Ads

పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయిన ‘ఖుషీ’ చిత్రం రీ రిలీజ్ తొలి రోజు రూ. 4.51 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

సింహాద్రి

ఎన్టీఆర్ రాజమౌళి కాంబోలో వచ్చిన సింహాద్రి ఓవరాల్‌గా రీ రిలీజ్‌లో రూ. 4.60 కోట్ల గ్రాస్ రాబట్టింది.

జల్సా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన జల్సా చిత్రం రీ రిలీజ్‌లో రూ. 3.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఒక్కడు

మహేశ్ బాబు హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కడు .రీ రిలీజ్‌లో రూ. 2.54 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

పోకిరి

మహేష్, పూరీ ‘పోకిరి’ ఓవరాల్‌గా రీ రిలీజ్ లో రూ. 1.73 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.

ఆరెంజ్

రామ్ చరణ్ ఆరంజ్ మూవీ ఫస్ట్ టైం రిలీజ్ తో పోల్చుకుంటే రీ రిలీజ్‌లోనే రూ. 3.36 కోట్ల గ్రాస్ సాధించి రికార్డ్ సృష్టించింది.

 

Previous articleసంక్రాంతికి ప్రభాస్ ప్రాజెక్ట్ కే తో పాటు బరిలోకి దిగనున్న చిత్రాలు ఇవే…
Next articleఈసారి హైదరాబాద్ కి వెళ్ళినపుడు బిర్యాని మాత్రమే కాకుండా వీటిని కూడా రుచి చూడండి..