Ads
మహేంద్రసింగ్ ధోని…భారత్ క్రికెట్ కీర్తి దశదిశల మారుమోగేలా చేయడమే కాకుండా తనకంటూ ఓ చరిత్రని సృష్టించాడు ధోని. ఈ పేరు తెలియని వారు ..ఈ వ్యక్తి తెలియని వారు లేరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికీ ఎప్పటికీ భారత్ క్రికెట్ ఫేవరెట్ ఆటగాడు, ఫేవరెట్ కెప్టెన్, ఫేవరెట్ వికెట్ కీపర్ ధోని. మరి అలాంటి ధోనీ లేకుండా పదహారేళ్ల తర్వాత మొదటిసారిగా భారత్ టీం ప్రపంచ కప్ ఆడుతోంది.
2007లో తొలిసారి భారత తరఫున ప్రపంచ కప్ ఆడిన ధోని.. 2011లో భారత్ ప్రపంచ కప్ ట్రోఫీ గెలుచుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇక ఆ తర్వాత 2017 వరల్డ్ కప్ లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. 2019 వరల్డ్ కప్ లో టీం లో స్ట్రాంగ్ ప్లేయర్ గా వ్యవహరించాడు. ఇలా పలు రకాల బాధ్యతలను సునాయాసంగా నిర్వహిస్తూ ముందుకు సాగిన ధోని ఈసారి ప్రపంచ కప్ లో సభ్యుడు కాదు.
Ads
ఈ నేపథ్యంలో పలువురు క్రికెట్ అభిమానులు ధోని ఇప్పటివరకు సృష్టించిన రికార్డులను ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ పలు రకాల పోస్ట్లు ,మీమ్స్ ద్వారా హైలైట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఎప్పటికీ క్రికెట్ చరిత్రలో మారుమోగే పేరు ధోని.. అని అభిమానులు అతనికి పడుతున్న నిరాజనాలు చూస్తే అర్థమవుతుంది. వికెట్ వెనక ఉండి వ్యూహాలు పన్నుతూ క్రికెట్ ను ముందుకు నడిపిన అపర చాణక్యుడు ధోని. క్రికెట్ జట్టులో ఎవరికైనా రీప్లేస్మెంట్ ఉంటుందేమో కానీ ధోనీకి మాత్రం క్రికెట్ చరిత్రలోనే రీప్లేస్మెంట్ లేదు.