“రోజా చరిత్ర ఏంటో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది..! అంటూ… “వంగలపూడి అనిత” కామెంట్స్..! ఏం అన్నారంటే..?

Ads

మంత్రి రోజా మీద తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యల మీద ఎంతో మంది సినీ ప్రముఖులు స్పందించారు. రోజాకి మద్దతు తెలుపుతూ, బండారు సత్యనారాయణ మాట్లాడిన మాటలు తప్పు అని, రోజాకి క్షమాపణలు చెప్పాలి అని, రోజా స్నేహితులు, సినీ నటులు అయిన కుష్బూ, రాధిక, రమ్య కృష్ణన్ వంటి సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఈ విషయం మీద తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

vangalapudi anitha about roja

“ఒక ఆడవారిని అనే మాటలు ఇవి కావు” అని అన్నారు. రాధిక అయితే ఈ విషయంపై మాట్లాడుతూ, “ఆ మాటలు చాలా తప్పు మాటలు” అని, “ఇలాంటివి చాలా సిగ్గుచేటు” అని అన్నారు. “మీరు కూడా పని మీద ఇంటి నుండి బయటకు వెళ్తారు. మీరు బయటికి వెళ్లిపోయాక మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా” అని అన్నారు. “ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు మీ పార్టీ పరువు మీరు తీశారు” అని అన్నారు. మిగిలిన హీరోయిన్స్ కూడా అలాంటి పదాలు వాడటం తప్పు అని అన్నారు.

vangalapudi anitha about roja

Ads

అయితే ఈ నేపథ్యంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు అయిన వంగలపూడి అనిత స్పందించి సోమవారం మీడియాతో మాట్లాడి “అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఏం తెలుసు అని వాళ్ళు మాట్లాడారు?” అని అన్నారు. “జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భార్యని కూడా ఇలా అన్నారు. కానీ అప్పుడు ఎవరు ఎందుకు స్పందించలేదు?” అని అన్నారు. “రోజా చరిత్ర ఏంటో తెలుసుకుని మాట్లాడాలి” అని, “లేకపోతే ప్రజల నుండి చీత్కారాలు తప్పవు” అని అన్నారు.

vangalapudi anitha about roja

“సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారిలో ఎవరి మీద ఇలాంటి కామెంట్స్ వచ్చినా కూడా వీళ్ళు ఇలాగే స్పందిస్తారా?” అని, అనిత రోజా రేణు దేశాయ్ గురించి మాట్లాడిన వీడియో ప్లే చేశారు. “మరి అప్పుడు వీళ్ళందరూ ఎందుకు స్పందించలేదు?” అని అన్నారు. అంతే కాకుండా, రోజా అంతకుముందు మాట్లాడిన మాటలకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్లే చేశారు. అందుకే, “ఆవిడకి మద్దతు తెలిపే ముందు ఆమె చరిత్ర ఏంటో తెలుసుకొని వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది” అని అన్నారు.

watch video :

Previous articleఏంటిది హార్దిక్ పాండ్యా.? అప్పుడు తిలక్ వర్మ విషయంలో చేసినట్టే..ఇప్పుడు రాహుల్ విషయంలో.?
Next article16 ఏళ్ల తర్వాత అతను లేకుండా మొదటిసారి వరల్డ్ కప్ ఆడిన టీం ఇండియా…ఆ ప్లేయర్ ఎవరంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.