Ads
సిని పరిశ్రమకి చెందినవారికి సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సినిమాకి కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టినప్పటి నుండి గుమ్మడికాయ కొట్టి షూటింగ్ పూర్తయ్యే దాకా. ఆ తరువాత జరిగే ఆడియో వేడుక నుండి చిత్రం విడుదల అయ్యేవరకు ప్రతిదానికి సమయం, సందర్భానికి ఖచ్చితమైనటువంటి ముహూర్తం పెట్టుకుని, దాని ప్రకారం అన్ని పనులు చేస్తుంటారు.
Ads
అలాగే టాలీవుడ్ స్టార్ హీరోలు భోజన ప్రియులు. సూపర్ స్టార్ కృష్ణ నుంచి హీరో ప్రభాస్ వరకు కూడా తెలుగు హీరోలకు ఉన్న సెంటిమెంట్లు మరియు ఆహారపు అలవాట్ల గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను చూద్దాం..
1. సీనియర్ ఎన్టీఆర్:
ఎన్టీరామరావుగారికి పొద్దున్నే రెండు, రెండున్నర గంటల సమయానికి మేల్కొనడం అలవాటు. లేవగానే ఒక చుట్ట కాల్చి, ఫ్రెష్ అయిన తరువాత ఇడ్లీ, దోశెలను నెయ్యితో తినేవారు. ప్రతిరోజూ ఒక పూర్తి కోడి మెనూలో ఉండాల్సిందే. ఆయన షూటింగులో ఉన్నప్పుడు బాదం పాలు, మిరపకాయ బజ్జీలు, స్వీట్స్ లాంటివి తీసుకునేవారు.
2. సూపర్ స్టార్ కృష్ణ:
సూపర్ స్టార్ కృష్ణకి చింత చిగురు మటన్, గోంగూర చికెన్అంటే చాలా ఇష్టమంట. చెన్నై చుట్టూపక్కల షూటింగ్ అయినపుడు లంచ్ కి ఇంటికి వెళ్ళి భోజనం చేశాక కాసేపు పడుకుని లేచిన తరువాత లొకేషన్‌కి వెళ్ళేవారంట.
3. సూపర్ స్టార్ రజినీ కాంత్:
రజినీ కాంత్ సొంతంగా ఎదిగి ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. ఆయన ఇండస్ట్రీకి రాకముందు బస్ కండక్టర్‌గా పని చేసేవారు. ఆయన ఇప్పటికీ అప్పుడు వాడిన కండక్టర్ యూనిఫామ్‌ని దాచుకున్నారు.
4. మెగాస్టార్ చిరంజీవి:
చిరంజీవికి ఉదయం అల్పాహారంగా గోధుమ రవ్వతో చేసిన ఉప్మాలో మీగడ కలుపుకుని తినడం చాలా ఇష్టమంట.
5. నందమూరి బాలకృష్ణ:
నందమూరి నటసింహ బాలకృష్ణ ఆమ్లెట్ ను చాలా ఇష్టంగా తింటాడు. కొన్ని వెజ్, నాన్ వెజ్ వంటకాలను ఇష్టంగా తీసుకుంటారంట. బాలకృష్ణకి నలుపు రంగు అరిష్టం అనే సెంటిమెంట్ కూడా ఉంది.
6. కింగ్ నాగార్జున:
కింగ్ నాగార్జున నాస్తికుడు. దేవుళ్లను నమ్మడు. అయితే ‘మానవ సేవు మాధవ సేవ’ అనే సూక్తిని బాగా నమ్ముతాడంట.
7. విక్టరీ వెంకటేష్:
వెంకటేష్ తన చిత్రాల విడుదల విషయంలో ఒక సెంటిమెంట్‌ని పాటిస్తాడట. సినిమాల తొలి కాపీ చెందిన రీళ్లను నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి,విజయవాడ కనకదుర్గమ్మ, మద్రాసు వడపళనిలోని కుమార స్వామి దేవాలయాల్లో పూజలు చేసిన అనంతరమే ప్రదర్శించించేలా చూసుకుంటాడంట.
8. రెబల్ స్టార్ కృష్ణంరాజు – ప్రభాస్:
కృష్ణం రాజు నుండి నటననే కాకుండా ఆహారపు అలవాట్లు కూడా ప్రభాస్‌కి వచ్చాయి. భీమవరం పద్ధతిలో వీరు చేసే బిర్యానీలు, నాన్ వెజ్ వంటకాలు బాగుంటాయని తిన్నవారు చెప్తుంటారు. ప్రభాస్ తమ ఇంటి భోజనాన్ని బాలీవుడ్ స్టార్స్ కి కూడా రుచి చూపించాడు.
9. సూపర్ స్టార్ మహేష్ బాబు:
మహేష్ బాబు ఫిట్నెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఏం తినలనిపించిన తినొచ్చు. కానీ అది పద్దతిగా ఎంత తినాలో అంతే తినాలని చెప్తుంటాడు.
10. జూనియర్ ఎన్టీఆర్:
ఎన్టీఆర్ కెరీర్ మొదట్లో నెయ్యిలో ముంచుకుని డజను ఇడ్లీలను తినేవాడని అంటుంటారు. ఆ తర్వాత అలవాట్లు మార్చుకున్నాడు. వండడంలో కూడా బెస్ట్ ఛెఫ్ అనిపించుకున్నాడు. తారక్ బిర్యానీ, నాన్ వెజ్ కూరలు బాగా చేస్తాడంట.
Also Read: నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలోని పింకీ ప్రస్తుతం ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?