పౌర్ణమి రోజు అలలు ఎందుకు ఎక్కువగా వస్తాయి…?

Ads

సముద్రతీరంలో అలలు అలా వస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. చూడడానికి బాగుంటుంది. చాలా మంది సముద్ర తీరానికి వెళ్లి కాసేపు సరదాగా గడిపి వస్తారు. ముఖ్యంగా పిల్లలకి బీచ్ ల వద్ద ఆడడం అంటే ఎంతో ఇష్టం. బీచ్ లకి వెళ్లి ఆడుతూ ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అలానే తీరం దగ్గర ఇసుక గూళ్ళు కట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ సృష్టి లో కొన్ని కొన్ని అంశాలు ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయి.

సముద్రాల లో చోటు చేసుకునే మార్పులు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి దీని వెనక సైన్స్ దాగి ఉంది. పౌర్ణమి సమయంలో అలలు పెద్దగా వస్తూ ఉంటాయి.

Ads

ప్రతి సారి కూడా పౌర్ణమి వచ్చిందంటే అలలు బాగా ఎక్కువగా వస్తాయని అందరూ అంటూ ఉంటారు. అయితే ఎందుకు పౌర్ణమి సమయంలో పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి..? దాని వెనుక కారణం ఏమిటి..? సైన్స్ ఏం చెబుతోంది అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రుడు భూమికి దగ్గరగా వున్నప్పుడు పౌర్ణమి వస్తుంది. ఆ సమయం లో ఎక్కువగా అలలు వస్తూ ఉంటాయి. నిజానికి అలలు చంద్రుని యొక్క స్థానాన్ని బట్టి మారతాయి. కేవలం సంద్రమే కాదు భూమి కూడా చంద్రుని గురుత్వాకర్షణ శక్తికి గురవుతుంది.

అయితే సముద్రాలు ద్రవ రూపం లో ఉండడం తో మార్పు బాగా కనపడుతుంది. భూమి చూస్తే ఘన రూపం లో ఉంటుంది కదా అందుకే ఎక్కువ మార్పు మనకి కనపడదు. అయితే మార్పు మాత్రం ఉంటుంది కానీ కనిపించదువు అంతే. భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో చంద్రుడు తిరుగుతాడు. ఒక్కోసారి భూమి దగ్గరగా వస్తాడు. అప్పుడు చంద్రుడు చాలా పెద్దగా కనపడతాడు. అలాంటి సమయంలో గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. అదే దూరంగా ఉంటే.. అలాంటి సమయం లో భూమి మీద చంద్రుని గురుత్వాకర్షణ శక్తి తక్కువ ఉంటుంది.

 

Previous articleతెలీని వ్యక్తితో పెళ్ళి… జీవితం ఎలా ఉంటుందో అర్ధమైపోయింది… ప్రతీ అమ్మాయి లైఫ్ లో ఇంతే.. కొత్తగా ఏమి జరగలేదు..!
Next articleసూపర్ స్టార్ కృష్ణ నుంచి హీరో ప్రభాస్ వరకు కూడా తెలుగు హీరోలకు ఉన్న సెంటిమెంట్లు ,ఇంట్రెస్టింగ్ విషయాలు.