Ads
కొన్ని సినిమాలలో కనిపించే కొన్ని సన్నివేశాలైనా సరే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దానికి కారణం ఆ సన్నివేశంలో నటించిన యాక్టర్ అద్భుతమైన నటన అని చెప్పక తప్పదు. అలాంటి సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. ఇప్పటికీ ‘సై’ మూవీ పేరు చెప్పగానే జ్ఞాపకం వచ్చే నటుల్లో వేణు మాధవ్ ఉంటారు.
Ads
ఆ చిత్రంలో వేణు మాధవ్ నల్ల బాలు అనే క్యారెక్టర్ లో కనిపించి నవ్వులు పూయించాడు. ఇంక సినిమాలో ‘నల్ల బాలు అంటే నల్ల తాచు లెక్క, నాకి చంపేస్తా’ అంటూ తనదైన యాటిట్యూడ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఇంత బాగా పండిన నల్లబాలు క్యారెక్టర్ కు ముందుగా అన్ని సీన్స్ లేవంట. ఫస్ట్ ఒక్కటే సీన్ అనుకున్నారంట, కానీ ఆ తరువాత మూడు సీన్లు చేసిన ఆ పాత్ర అందరికీ గుర్తుండిపోయింది. అసలు ఏం జరిగిందంటే..సై సినిమాకి దర్శకధీరుడు రాజమౌళి డైరెక్టర్. ఎవరెన్ని చెప్పినా చివరికి తాను అనుకున్నది మాత్రమే తీయడం రాజమౌళికి అలవాటు. ఎవరు చెప్పిన సినిమాలో తాను అనుకున్నదే తీస్తాడు తప్ప ఏ మార్పులు చేయడు అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. సినిమాకి ప్లస్ అవుతుందనుకుంటే తప్ప సీన్స్ ని యాడ్ చేయరు. అలానే ‘సై’ మూవీలో యాడ్ చేసిన సీన్సే కామెడీయన్ వేణు మాధవ్ చేసినవి. కాలేజీ గోడలపై పెయింట్ వేయించే వ్యక్తి నల్లబాలుగా స్టూడెంట్స్, ఆ తరువాత పోలీస్, విలన్‌లను బెదిరించి, తరువాత ఇరుకున పడే పాత్రలో వేణు మాధవ్ సీన్స్ అందరూ చూసే ఉంటారు. ఈ సీన్ లో జక్కన్న కూడా కనిపిస్తారు. రాజమౌళి ముందుగా వేణు మాధవ్ కోసం ఒక్క సీన్ నే రాసుకున్నారట.అదే స్టూడెంట్స్‌ను బెదిరిస్తూ వేణు మాధవ్ ‘నల్ల బాలు అంటే నల్ల తాచు లెక్క, నాకి చంపేస్తా’ అంటూ డైలాగ్ చెప్తుంటే జక్కన్న కట్ చెప్పకుండా పడిపడి మరి నవ్వారంట. డైలాగ్ చివర్లో ‘నాకి చంపేస్తా’ అనేది వేణు మాదవే యాడ్ చేశాడంట. ఆ తరువాత ఆ సన్నివేశాలను ఎడిట్ చేస్తున్నప్పుడు ‘ఈ కామెడీ ట్రాక్ ను పెంచితే మూవీకి ప్లస్ అవుతుందని భావించి, వేణు మాధవ్‌కు పిలపించారంట.
Also Read: తెలుగులో రీమేక్ అయిన 10 మలయాళ చిత్రాలు, వాటి ఫలితాలు