జక్కన్న అతిధి పాత్రలో నటించిన 6 సినిమాలు ఏమిటో తెలుసా?

Ads

తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి గురించి అందరికీ తెలిసిందే. జక్కన్న సినిమా తీస్తున్నారంటే ఆ చిత్రం ఖచ్చితంగా హిట్ అని ఆడియెన్స్ నమ్ముతారు. అంతగా ఆయన సినీ ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నారు.

Ads

ఇక ఇప్పటివరకు దర్శకధీరుడు రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. జక్కన్న మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ నుండి ఆర్ఆర్ఆర్ వరకు ప్రతి సినిమా దర్శకుడిగా రాజమౌళి ఇమేజ్ ని పెంచుతూ వస్తున్నాయి. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ గుర్తింపును సంపాదించడమే కాకుండా ఆ సినిమాకు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. న్యూయార్క్ క్రిటిక్స్ ఉత్తమ దర్శకుడి అవార్డ్ అందుకున్నాడు. ఈ అవార్డ్ పొందిన మొదటి భారతీయ దర్శకుడు రాజమౌళి కావడం విశేషం.మరి అంట పెద్ద దర్శకుడు ఒక మూవీ తెరకెక్కిస్తున్నాడంటే ఆ చిత్రంలో నటించే అవకాశం కోసం చాలా మంది యాక్టర్స్ ఎదురు చూస్తుంటారు. జక్కన్న మూవీస్ లో ఎంత చిన్న పాత్రకు అవకాశం దొరికిన విడిచిపెట్టరు. ఇక రాజమౌళి సినిమాలకు దర్శకత్వం చేయడం మాత్రమే కాకుండా ఆయన కొన్ని సినిమాల్లో అతిధి పాత్రలో కూడా నటించారు. మరి స్టార్ డైరెక్టర్ రాజమౌళి కనిపించిన సినిమాలు ఏమిటో చూద్దాం..1. ఆర్ఆర్ఆర్- ఎత్తర జెండా పాట
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమాలోని ఎత్తర జెండా పాటలో కనిపించి, అలరించారు.
2.బాహుబలి: ది బిగినింగ్ -వైన్ సెల్లర్
ప్రభాస్, రానా నటించిన బాహుబలి మొదటి పార్ట్ లో వైన్ సెల్లర్ గా నటించారు.3.మగధీర (అనగనగా పాట)
మగధీర సినిమాలో చివరలో వచ్చే అనగనగా అనే సాంగ్ లో కనిపించారు.4.సై
నితిన్ హీరోగా వచ్చిన సై సినిమాలో నల్ల బాలుగా నటించిన వేణుమాధవ్  అనుచరుడుగా రాజమౌళి నటించారు.5.రెయిన్ బో
రెయిన్ బో మూవీలో కూడా రాజమౌళి అతిధి పాత్రలో నటించారు.6.మజ్ను
నాని హీరోగా నటించిన మజ్ను సినిమాలో  అతిధి పాత్రలో నటించారు.
Also Read: కేవలం ఒక్క డ్రెస్ తోనే పూర్తి చేసిన 8 సినిమాలు..

 

Previous article‘సై’ సినిమాలో రాజమౌళి, వేణు మాధవ్‌ సీన్స్ వెనుక ఉన్న స్టోరీ ఏమిటో తెలుసా?
Next articleనెలసరి సమయంలో స్త్రీలు పూజలు ఎందుకు చేయకూడదంటే..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.