Ads
నవరస నటనా సార్వభౌముడిగా పేరు పొందిన కైకాల సత్యనారాయణ దొరికిన టాలీవుడ్ కి దొరికిన ఆణిముత్యం. ఆయన విలన్ గానే ఎక్కువగా పాపులర్ అయ్యాడు.
Ads
అయితే కైకాల సత్యనారాయణ నెగిటివ్ రోల్స్ తోనే పాపులారీతిని పొందినా, నిజ జీవితంలో కూడా విలన్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన విలనిజం ఎంతగా పండించారంటే ఒక టైమ్ లో అయితే మహిళలు ఆయనను చీదరించుకునే వారంట. ఆయన విలన్ అనే పదానికి కొత్త అర్థాన్ని చూపించారు.
సత్యనారాయణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు విలన్ గా నటించి, మెప్పించిన ఈయన రాను రాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారుతూ వచ్చారు. ఇక వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. సత్యనారాయణ కెరియర్ తొలి రోజుల్లో సినీ అవకాశాల కోసం చాలా కష్టపడ్డారు. అయితే ఆయనకు నటన వైపు వెళ్లాలలన్నా కోరిక మొదలైంది ఎప్పుడు అంటే, ఆయన గుడివాడలో కాలేజీ చదువుకునే రోజుల్లో అక్కడ అక్కినేని నాగేశ్వరరావు యాక్ట్ చేసిన నాటకాన్ని చూసాకా యాక్టర్ అవ్వాలనే ఆసక్తి కలిగిందట.ఇక అప్పుడు సినిమాల్లో నటించడానికి మద్రాసు వెళ్ళి, ఎల్వి ప్రసాద్ ను కలిశారు. ఆయన సత్యనారాయణను చూసి మీకు నటుడు అయ్యే ఛాన్స్ ఉందని,ప్రస్తుతం మేము సినిమా తీయడానికి ఇంకా 2 నెలల టైమ్ పడుతుంది. మీరు ఇప్పుడు వెళ్ళి ఆ సమయానికి రమ్మని చెప్పారంట. ఆయన వెనక్కి వెళ్లిపోకుండా మద్రాస్ లోనే తిరుగుతూ అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ క్రమంలో ఆయనను కే.వి తిలక్ చూసి ఎమ్మెల్యే అనే చిత్రంలో సెకండ్ హీరోగా ఛాన్స్ ఇచ్చి, ఆ తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చారు.
ఇక భూకైలాస్ సినిమాలో కూడా ఛాన్స్ వచ్చి, చేజారిపోయింది. సత్యనారాయణ చాలా కష్టాలు పడ్డ తర్వాత సిపాయి కూతురు సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో ఆయన నటన చూసి విఠలాచార్య సత్యనారాయణను విలన్ గా మార్చారు. ఇక విఠలాచార్య వల్లనే కైకాల సత్యనారాయణ విలన్ గా తన స్థానాన్ని ఇండస్ట్రీలో పదిల పర్చుకున్నారు.
Also Read: అమెజాన్ ప్రైమ్ లో ‘పుష్ప’ సినిమాతో పాటు అత్యధిక వ్యూయర్ షిప్ ను సాధించిన 10 సినిమాలు..