ఈ 10 మంది స్టార్లు మొదటి సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

Ads

ప్రస్తుతం సినిమాల్లో స్టార్ స్టేటస్ ను ఆస్వాదిస్తున్న నటీనటులు కోట్లల్లో రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారు. అయితే వీరు ఒకప్పుడు ఇబ్బందులు పడ్డ సందర్బాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఆ స్టార్స్ చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.

అయితే ఆ స్టార్ల ఫస్ట్ సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్‌ కి, ఇప్పడు తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌ కి పొంతనే లేదు. ఇక కొంతమంది స్టార్లు తీసుకున్న తొలి రెమ్యూనరేషన్‌ వందల్లో తీసుకున్నారని తెలిస్తే చాలా మంది షాక్ అవడం ఖాయం. మరి అలాంటి స్టార్స్ ఫస్ట్ సినిమా రెమ్యూనరేషన్‌ ఎంతో చూద్దాం రండి..

1. మెగాస్టార్ చిరంజీవి :
1978 లో చిరంజీవి మొదటి సినిమా పునాది రాళ్ళు రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి చిరంజీవి తీసుకున్న రెమ్యూనరేషన్‌ కేవలం వెయ్యి నూట పదహార్లు(రూ.1116). ప్రస్తుతం చిరంజీవి ఒక్కో మూవీకి రూ.60 కోట్లు తీసుకుంటున్నారు.
2. కమల్ హాసన్ :
కమల్ హాసన్ తన తొలి చిత్రం ‘కలతూర్ కన్నమ్మ’ ఐదు వందలు పారితోషికం తీసుకున్నారు. ప్రస్తుతం కమల్ ఒక్కో మూవీకి రూ.30 కోట్ల వరకు తీసుకుంటున్నారు.3. అమిర్ ఖాన్ :
అమిర్ ఖాన్ మొదటి సినిమా ‘కయామత్ సే కయామత్ తక్’ కి రూ.11000 రెమ్యూనరేషన్‌ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఒక మూవీకి రూ.80-100 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.
4. అమితాబ్ బచ్చన్ :
అమితాబ్ మొదటి చిత్రం సాత్ హిందుస్తానీ. ఈ సినిమా 1969లో వచ్చింది. ఈ మూవీకి ఆయన రూ.5000 పారితోషికంగా అందుకున్నారు. ప్రస్తుతం ఆయన రూ.10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారు.
5. అజిత్ :
అజిత్‘పాసమలార్గల్’ అనే సినిమాలో ఒక్క నిమిషం ఉండే పాత్రను పోషించారు. ఈ సినిమాకి ఆయన రూ.2500 రెమ్యూనరేషన్‌ అందుకున్నారు. ప్రస్తుతం అజిత్ ఒక్కో మూవీకి రూ.70 కోట్ల దాకా తీసుకుంటున్నాడు.
6.మోహన్ లాల్ :
మోహన్ లాల్ తొలి సినిమా ‘మంజిల్ విరింజల్ పొక్కల్’కు రూ.2000 రెమ్యూనరేషన్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఒక్కో మూవీకి ఆయన రూ.60 కోట్లు తీసుకుంటున్నారు.7.విజయ్ :
విజయ్ బాలనటుడిగా చేసిన ఫస్ట్ మూవీ ‘వెట్రి’. దీని కోసం విజయ్ రూ.500 అందుకున్నాడు. ప్రస్తుతం ఒక్కో మూవీకి రూ.100 కోట్లు తీసుకుంటున్నారు.

Ads

8.దీపికా పదుకోనె :
దీపికా పదుకోనె ఫస్ట్ మూవీకి రెమ్యూనరేషన్‌ లేదు.నమ్మడం కష్టమైన ఇది నిజం. దీపికా తొలి సినిమా ‘ఓం శాంతి ఓం’కి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ప్రస్తుతం ఆమె రూ.10-15 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటుంది.

9.అక్షయ్ కుమార్ :
అక్షయ్ కుమార్ ఫస్ట్ సినిమా ‘సౌగంధ్’కి రూ.51000 పారితోషికం తీసుకున్నాడట. ప్రస్తుతం ఒక్కో మూవీకి రూ.60 కోట్లు తీసుకుంటున్నాడు.
10.ఎన్టీఆర్ :
ఎన్టీఆర్ తొలి మూవీ ‘నిన్ను చూడాలని’కి రూ.4 లక్షలు రెమ్యూనరేషన్‌ అందుకున్నాడు. ప్రస్తుతం ఒక్కో మూవీకి రూ.60 కోట్లు తీసుకుంటున్నాడు.
Also Read:2022 లో టాలీవుడ్ లో వచ్చిన 10 రీమేక్ చిత్రాలు.. వాటిలో హిట్లు ఎన్ని, ప్లాపులు ఎన్ని?

 

Previous articleమెగాస్టార్ చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ చిత్రంలో నటించిన చిన్నారి ఎవరు? ఎలా ఉందో తెలుసా.?
Next articleకైకాల సత్యనారాయణను విలన్ గా మార్చింది ఆయనేనా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.