Ads
ప్రస్తుతం వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుంది. ఆదివారం నాడు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి టోర్నమెంట్ లో బోణి కొట్టేసింది టీం ఇండియా. ఇది ఇలా ఉంటె… నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి మ్యాచ్ జరిగిన సంగతి అందరికి తెలిసిందే.
ఇంతకుముందు జరిగిన అవమానానికి న్యూజిలాండ్ ..ఇంగ్లాండ్ పై తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. 9 వికెట్ల భారీ తేడాతో 36.2 ఓవర్లలో నిర్ణీత 282 స్కోర్ ను సునాయాసంగా చేదించి తొలి మ్యాచ్ లో విజయ బావుటా ఎగురవేసింది. రచిత్ రవిచంద్ర 82 బంతులను ఎదుర్కొని బీభత్సకరమైన ఎదురు దాడి చేసి 111 పరుగులు రాబట్టి టీం విజయానికి తన వంతు కృషి చేశాడు. డేవన్ కాన్వే చేసిన మెరుపు సెంచరీ కూడా జత కావడంతో వీళ్ళిద్దరూ న్యూజిలాండ్ ను గెలుపు వైపు నడిపించారు.
అయితే ప్రస్తుతం ఒక విషయం చర్చనీయాంశం అయ్యింది. వరల్డ్ కప్ కంటే ఐపీఎల్ ఏ పెద్దదా అంటూ ట్రెండ్ అవుతుంది ఆ న్యూస్. మ్యాచ్ అంటే…అందులోనూ వరల్డ్ కప్ అంటే రష్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అనుకుంటున్నారా…ఊహించిన దానికి విరుద్ధంగా వెలవెలబోతున్న స్టేడియం ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తొలి ప్రపంచ కప్ మ్యాచ్ ఇలా ఆదరణ లేకుండా ఉండడం ఏమిటి అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ మ్యాచ్ కోసం బీసీసీఐ ఎటువంటి ప్రారంభ వేడుకలను నిర్వహించకపోవడం మరింత విడ్డూరంగా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఖాళీ స్టేడియం ఫోటోలు చూసి నేటిజెన్లు పలు రకాల కామెంట్స్ పెడుతున్నారు.
Ads
మరోపక్క…ఐపీఎల్ 2023 ఓపెనింగ్ వేడుక ఎంత గ్రాండ్ గా జరిగిందో అందరికి తెలిసిందే. అది కూడా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలోనే ఆరంభోత్సవం జరిగింది. నాటు నాటు సహా సామి సామి, ఊ అంటావా లాంటి పాటలకు ముద్దుగుమ్మలు డ్యాన్స్ చేశారు. తమన్నా, రష్మిక తమ డాన్స్ లతో హైలైట్ గా నిలిచారు. బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్, కత్రినా కైఫ్, సింగర్ అరిజిత్ సింగ్ ల పెర్ఫార్మన్స్ తో ఎంతో ఘనంగా జరిగింది ఐపీఎల్ ఓపెనింగ్ వేడుక.
అంతేకాదు ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ కి ఆడియన్స్ తో ఫుల్ ప్యాక్ అయిపోయింది క్రికెట్ స్టేడియం. ముఖ్యంగా ధోని ఎంటర్ అవ్వగానే ఏ రేంజ్ లో సంబరాలు చేసారో అందరికి తెలిసిందే. క్రికెట్ ఫాన్స్ కూడా ఈ సారి వరల్డ్ కప్ పైన అంత ఇంటరెస్ట్ చూపించట్లేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ధోని లేకపోవడం వల్లే అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే 2019 వరల్డ్ కప్ కి కూడా హైప్ ఉంది. కానీ ఇప్పుడు అంత లేదు. ఏది ఏమైనా బీసీసీఐ ఓపెనింగ్ వేడుక పెట్టి…గతంలో లాగే వరల్డ్ కప్ స్పెషల్ అడ్వేర్తైసెమెంట్లు పెట్టి ఉంటే ఇంపాక్ట్ మరో లాగ ఉండేది అనుకుంట.