ప్రజారాజ్యం పెట్టినప్పుడు…ఈ పెంకుటిల్లు చిరంజీవికి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో తెలుసా.? తర్వాత మెగాస్టార్.?

Ads

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా మెగాస్టార్ అని శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తి చిరంజీవి. సినిమాల్లో నటించడమే కాకుండా ప్రజల కొరకు సేవ చేయడంలో కూడా చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను అందించిన చిరంజీవిపై ఒక పెంకుటింటి కారణంగా చెరగని మచ్చ ఏర్పడింది.

సొంత ఊరి కోసం మూడు లక్షల రూపాయలు కూడా వదులుకోలేక…ఇంటిని అమ్మేశాడు అన్న అపవాదులు చిరంజీవిని ఎన్నో సంవత్సరాలు వెంటాడింది. ఇంతకీ విషయం ఏమిటంటే…చిరంజీవి తల్లిదండ్రులు మొగల్తూరు లోని పాతకాలవ సెంటర్లో ఒక పెంకుటింట్లో నివసించేవారు. చిరంజీవి జన్మించిన దగ్గర నుంచి అతని విద్యాభ్యాసం మొత్తం నరసాపురంలోని సాగింది. ఈ ఇంటి తో చిరంజీవి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.

Ads

అయితే 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పాలకొల్లులో చిరంజీవి పై ప్రధానంగా ఉపయోగించిన అస్త్రం.. మొగల్తూరు లోని అతని ఇంటిని లైబ్రరీకి ఇవ్వకుండా మూడు లక్షల రూపాయలకు అమ్మేశారు అనే విషయం. అయితే చాలామందికి తెలియని నిజం ఏమిటంటే చిరంజీవి నివసిస్తున్న ఆ పెంకుటిల్లు అతని తండ్రికి కాదు…అమ్మమ్మ గారి ఇల్లు. అవసరార్థం అక్కడ ఉన్నారే తప్ప ఆ ఇంటి పై చిరంజీవికి ఎటువంటి హక్కు లేదు.

 

ఆ ఇంటిని చిరంజీవి మేనమామ ఆ తరువాత అతని అవసరాల కోసం అమ్మడం జరిగింది. అయితే ఈ విషయం తెలియని చాలామంది సొంత ఊరి కోసం ఆ మాత్రం చేయలేకపోయాడు అని చిరంజీవిపై దుష్ప్రచారం చేశారు. ఇటువంటి ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టడం కోసం చిరంజీవి తన సొంత ఖర్చుతో మొగల్తూరులో ఒక గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

ఇక కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో చాలా చోట్ల కొన్ని కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి పనులు కూడా చేయించారు. తన గురించి చెడ్డగా మాట్లాడినా.. చిరంజీవి చివరకు వాళ్లకు మంచి చేయడానికి ప్రయత్నించారు…అందుకే మెగాస్టార్ అయ్యాడు.

watch video:

Previous articleవరల్డ్ కప్ కంటే ఐపీఎల్ పెద్దది అనుకుంటా.? లేదంటే “ధోని” లేకపోవడం వల్ల ఇలా జరిగిందా.?
Next articleఅతను ఎందుకు ఉన్నట్టు.? అంతమంచిగా ఆడుతున్న కె.ఎల్.రాహుల్ స్థానాల్లో అతను ఎందుకు.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.