ఒకే ఒక్క కండీషన్ వల్ల తెలుగు స్టార్ హీరో సినిమా వదులుకుందా..? అదేంటంటే..?

Ads

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తెగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

ధడక్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో భాగంగా బిజీబిజీగా గడుపుతోంది జాన్వీ కపూర్. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా కంటే ముందు జాన్వి కపూర్ మరొక పాన్ ఇండియా మూవీలో నటించే అవకాశాన్ని చేజార్చుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏది? జాన్వీ కపూర్ ఆ సినిమాను ఎందుకు వద్దనుకుంది? అన్న వివరాల్లోకి వెళితే.. జాన్వీ కపూర్ మిస్ చేసుకున్న ఆ సినిమా మరేదో కాదు రాంచరణ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమా.

Ads

చెర్రీ ఇప్పటికే ఈ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ కూడా మొదలెట్టారు. అయితే ఈ మూవీలో మొదట రామ్ చరణ్‌ పక్కన జాన్వీ ని హీరోయిన్ గా అనుకున్నారట డైరెక్టర్ బుచ్చిబాబు. అందుకోసం ఆమెకు ఒక కండీషన్ పెట్టారట. తన సినిమా మట్టికి సంబంధించిన కథ కావడం క్యారెక్టర్ దృష్ట్యా హీరోయిన్‌కు స్పెషల్ గెటప్ ఉండడం.. అది కూడా సినిమా రిలీజ్ వరకు రివీల్ కాకుండా జాగ్రత్త పడాలని బుచ్చిబాబు అనుకున్నారట.

అందుకే ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు మరే సినిమాకు కమిట్ అవ్వొద్దని జాహ్నవికి కండీషన్ పెట్టారట. దాంతో పాటే బల్క్‌ డేట్స్‌ కావాలని ఆమెకు చెప్పారట. అయితే బుచ్చిబాబు కండీషన్‌తో డైలామాలో పడిన జాన్వీ కాస్త వెనకడుగు వేశారట. డైరెక్టర్ కు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా మిన్నకున్నారట. దీంతో బుచ్చిబాబు మరో హీరోయిన్ వేటలో పడ్డారట.

Previous articleడంకీ స్టోరీ లీక్..! సలార్ కంటే ఇదే బాగుందిగా..?
Next articleగీజర్ కొనలేక వేడి నీళ్ల కోసం… ఈ వ్యక్తి చేసిన పని చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.