Ads
చలి కాలం మొదలు అయ్యింది. దీంతో చలి బాగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా పడుతున్నాయి. చల్లని వాతారణ పరిస్థితిలో అందరు వెచ్చదనం కోసం ఉన్ని వస్త్రాలను ఉపయోగిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం వరకు చల్లటి నీళ్లతో స్నానం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ చలి పెరగడంతో అంతా వేడి నీళ్లే ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్ లో ఉన్ని వస్త్రాలకు, వేడినీళ్ల గీజర్లకు డిమాండ్ పెరిగింది. గీజర్ల ఖరీదు వేలల్లో ఉండడంతో ఒకరు ఇంట్లోనే గీజర్ ను తయారు చేశారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
చలికాలం కావడంతో ఇళ్లలో వాటర్ హీటర్ల ఉపయోగం బాగా పెరిగిపోయింది. కొందరు గీజర్లు కూడా ఇంట్లో ఏర్పాటు చేసుకుంటుంటారు. కానీ వేలల్లో ధర పెట్టి కొనలేనివారు, కరెంట్ బిల్లు పెరుగుతుందనే భయంతో కొందరు వాటి వైపు చూడకుండా చల్లని నీటితోనే సరిపెట్టుకుంటున్నారు.
తాజాగా ఒక వ్యక్తి మాత్రం గీజర్ కొనలేక, తన ప్రతిభతో కొత్తగా ఆలోచించి, ఇంట్లోనే గీజర్ ను తయారు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు ఆ వ్యక్తి తెలివిని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన కొందరు ‘దేశీ గీజర్’ అని పిలుస్తున్నారు. ఒక రాగి పైపును ఉపయోగించి తయారు చేసిన ఈ దేశీ గీజర్ అద్భుతంగా పనిచేస్తుంది. నీరు నిమిషాల్లో వేడిగా అవుతున్నాయి.
ఈ వైరల్ వీడియోలో, వాటర్ ట్యాప్‌కు కాపర్ పైపును కనెక్ట్ చేశాడు. ఆ తరువాత ఆ పైప్ ను స్ప్రింగ్ లా తిప్పి, దాని గ్యాస్ బర్నర్ పై పెట్టి ఆన్ చేశాడు. పైపు చివరి కొనను బకెట్ లో వేశాడు. ట్యాప్ ఆన్ చేయటంతో వాటర్ వేడి కాపర్ పైపు ద్వారా వేడి నీళ్ళు బకెట్ లోకి వస్తున్నాయి. కొందరు కరెంట్ ఆదా చేయడానికి ఇది చక్కని మార్గంగా అని అంటున్నారు.
Also Read: ట్యూబ్ లెస్ టైర్ పంక్చర్ రిపేర్ పేరుతో ఇంత మోసం జరుగుతుందా.? అలాంటి చోట్ల జాగ్రత్త.!