తెలంగాణ ఎన్నికలపై ప్రముఖ సర్వే రిపోర్ట్…బీజేపీకి పెద్ద షాక్…అన్నే సీట్లు అంట.?

Ads

తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గరపడే కొద్దీ అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో హైటెన్షన్ నెలకొంది. ఓటర్లు ఏ పార్టీ వైపు ఉన్నారో తెలియక, నాయకులు వారిని ప్రసన్నం చేసుకోవడం కోసం  ప్రచారంలో భాగంగా చేయాల్సినవన్నీ చేస్తూ పోతున్నారు.

అభ్యర్థులు చిన్న అవకాశం దొరికినా దాన్ని సువర్ణావకాశంగా మార్చుకుని ప్రచారంలో ముందుకెళ్తున్నారు. ఇదంతా ఒకవైపు. అయితే మరోవైపు ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారనే విషయం ఎవరికి అంతుపట్టడం లేదు. తాజాగా ‘జనతా కా మూడ్’ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈసారి ఎలెక్షన్స్ లో ఏ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కడతారనే విషయం ప్రముఖ సర్వే సంస్థలకు కూడా అంతుచిక్కట్లేదు. కొన్ని సర్వేలలో కాంగ్రెస్‌ గెలుస్తుందని వస్తే, మరికొన్ని సర్వేల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొడుతోందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘జనతా కా మూడ్’ సంస్థ సర్వే ఫలితాలను ప్రకటించింది. తెలంగాణ ఎలెక్షన్స్ లో ఈసారి కూడా బీఆర్ఎస్ కే అధికారం దక్కుతుందని వెల్లడించింది.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ కే పట్టం కట్టబోతున్నట్టు, మూడవసారి కూడా సీఎం కేసీఆరే అని సర్వేలో వెల్లడైంది. బీఆర్ఎస్ పార్టీకి 72 -75 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 31-36 స్థానాలు పొంది ప్రతిపక్ష హోదా దక్కించు కోబోతుందని వెల్లడించింది. ఇక బిజెపి 7-9 స్థానాలకే పరిమితం అవనుందని తెలిపింది. ఎంఐఎంకు 4-6 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని ఆ సర్వేలో తేలింది. ఇక బీఆర్ఎస్ కు 41శాతం ఓట్లు పడతాయని, కాంగ్రెస్ పార్టీకి 34 % ఓట్లు పడతాయని, బిజెపికి 14 % ఓట్లు వస్తాయని జనతా కా మూడ్ సంస్థ ప్రకటించింది.

Ads

తెలంగాణ వ్యాప్తంగా జనతా కా మూడ్ సంస్థ లక్షా 20 వేల శాంపిళ్లను సేకరించి, లోతైన విశ్లేషణ చేసినట్టు, ఈ ఎలెక్షన్స్ లో చాలా కీలక అంశాలు ఉన్నాయని వెల్లడించారు. రెండు నెలలపాటు సర్వే నిర్వహించమని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 2015, 2016, 2017లో అస్సాం, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎలెక్షన్స్ ఫలితాలు ఈ సంస్థ చేసిన సర్వే ఫలితాలు దాదాపుగా ఒకటే అవడం విశేషం.

Also Read: కేసీఆర్ పెళ్లి నాటి ఫోటో చూసారా..? ఎంత చిన్నగా ఉన్నారో చూడండి..?

Previous articleవాష్ బేసిన్ మధ్య భాగంలో ఈ హోల్ ఎందుకు ఉంటుందో తెలుసా.. ?
Next articleవరుసగా హ్యాట్రిక్ హిట్లు కొట్టిన ఈ “లక్కీ గర్ల్” కి ఏమైంది.? ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదంట.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.