Ads
2005లో మధురైలో డిఎండికే పార్టీని స్థాపించారు విజయకాంత్. పార్టీ స్థాపించిన మరుసటి ఏడాది 2006లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లో డిఎండికే అభ్యర్థులను బరిలోకి దింపారు కానీ ఆ ఎన్నికలలో డిఎండికే పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం విజయ్కాంత్ ఒక్కరే గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో డిఎండికే పార్టీకి 8.33% ఓట్లు వచ్చాయి.
ఆ తరువాత 2009లో జరిగిన లోక్సభ ఎన్నికల్లోను విజయకాంత్ పార్టీకి పరాభవం తప్పలేదు. సినిమా హీరోగా అనేక విజయాలు అందుకున్న విజయ్ కాంత్ రాజకీయాల్లో మాత్రం అనే ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ప్రత్యర్థుల విజయాన్ని డిసైడ్ చేసే స్థాయికి వెళ్లినప్పటికీ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయారు. 2011 నుంచి 2016 వరకు తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉండటమే ఆయన రాజకీయాల్లో సాధించిన గొప్ప విజయం గా చెప్పుకోవచ్చు.
Ads
ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో సీఎం గా ఉన్న జయలలితతో డి అంటే డి అనే స్థాయి లో ఉండేవారు విజయ్ కాంత్. శాసనసభలో వాళ్ళిద్దరి మధ్య చాలా సార్లు వాగ్వాదం జరిగింది. ఒకసారి శాసనసభలో డిఎండికే నేత చంద్రకుమార్ అసెంబ్లీలో మాట్లాడుతూ బస్సు చార్జీల గురించి ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి జయలలిత సమాధానం చెప్పారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ధరల పెంపును ఎందుకు ప్రకటించలేదని విజయకాంత్ జయలలితను ప్రశ్నించారు.
దీనిపై జయలలిత స్పందిస్తూ త్వరలోనే శంకరన్ కోయిల్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఆ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే పార్టీ ఒంటరిగా నిలిచి విజయం సాధిస్తుందని మరి అంత బలం మీ డీఎండీకే పార్టీకి ఉందా అంటూ ప్రశ్నించారు. దీంతో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది ఆ సమయంలో కోపోద్రిక్తుడైన విజయ్ కాంత్ నాలుక మడతపెట్టి జయలలిత ముందే ఆమె పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ వివాదం అప్పట్లో పెను సంచలనంగా మారింది.