Ads
ఒకప్పటి హీరోయిన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అందరికీ సుపరిచితురాలు. జయలలిత తమిళ నటి అయినా కూడా తెలుగులో కొన్ని సినిమాల్లో నటించారు. అంతే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా తమిళనాడుకి అభివృద్ధి లో తనదైన ముద్ర వేశారు. కొంతకాలం క్రితం జయలలిత ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. జయలలిత మరణించిన తరువాత ఆమె రాసిన ఒక లెటర్ ఆన్‌లైన్‌లో బయటికి వచ్చింది. ఆ లెటర్ 1980లో పీయుష్ అనే వ్యక్తి రాసిన లేకహ అని తెలుస్తోంది. ఆ సమయానికి జయలలిత సినిమాలు మానేసి రాజకీయాల వైపు వెళ్లారు.
కానీ ఆమె తిరిగి సినిమాలలో నటించడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఒక మేగజైన్‌లో ప్రచురించిన వార్త పై స్పందిస్తూ జయలలితనే ఈ లేఖను స్వయంగా రాసిందని తెలుస్తోంది. మరి అందులో ఏం రాశారో ఇప్పుడు చూద్దాం.. తాను సినిమాలలో నటించడానికి ప్రయత్నించలేదని, అది నిజం కాదని చెప్పడం కోసం జయలలిత ఆ లెటర్ లో తనకు వచ్చిన ఒక పెద్ద ఆఫర్ ను రిజెక్ట్ చేసిన విషయన్ని ఆ లేఖలో తెలిపింది. 1980లో రిలీజ్ అయిన ‘బిల్లా’ మూవీలో తనకు ఆఫర్ వచ్చిందని, అది కూడా దేశంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఉన్న బాలాజీ ప్రొడక్షన్స్ నిర్మించిన మూవీ అని, ఆ మూవీలో హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఆ సినిమాలో ముందుగా తనకే ఆఫర్ చేశారు.
Ads
తాను సినిమాలలో నటించాలనుకుంటే రజినీకాంత్ వంటి సూపర్ స్టార్ పక్కన హీరోయిన్ గా చేసే ఛాన్స్ ను వదులుకునేదాన్ని కాదు అని రాసుకొచ్చారు. తాను ఆ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసిన తర్వాత ఆ అవకాశాన్ని శ్రీప్రియకు బాలాజీ ప్రొడక్షన్స్ ఇచ్చిందని ఆ లెటర్ లో జయలలిత వివరించారు. అంతే కాకుండా ఈ విషయాన్ని బాలాజీ కూడా పబ్లిగ్గానే వెల్లడించారు. ఈ విషయం అందరికీ తెలుసు. మీరు ఎందుకు తెలుసుకోలేకపోయారో అర్థం కావట్లేదని, ఆ భగవంతుడి దయ వల్ల ఆర్థికంగా తనకి ఎలాంటి కష్టాలు లేవని, తన దృష్టి వేరే వైపు ఉందని, ఇక పై సినీ కెరీర్‌ను కొనసాగించడంలో తనకు ఆసక్తి లేదని జయలలిత ఆ లెటర్ లో తెలిపారు.