Ads
గూడచారి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటి శోభిత ధూళిపాళ. ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించిన ఈ భామ హాలీవుడ్ లో కూడా నటించి మెప్పించింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ చిత్రం మంకీ మ్యాన్. అయితే విశాఖపట్నంలోని తెనాలిలో పుట్టిన ఈ నటి తెలుగు అమ్మాయిల సత్తా చాటిందని చెప్పాలి.
అసలు తెనాలిలో ప్రారంభమైన ఆమె ప్రయాణం హాలీవుడ్ వరకు ఎలా సాగిందో చూద్దాం. శోభిత ధూళిపాళ్ల 1993 మే 31న వేణుగోపాలరావు, శాంతారావు దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలిలో జన్మించింది. విశాఖపట్నంలోని లిటిల్ ఏంజెల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లోని చదివింది. తర్వాత ముంబై యూనివర్సిటీ హెచ్ ఆర్ కాలేజ్ లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. సాంప్రదాయం నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలలో ఈమె ప్రవీణురాలు.
Ads
నేనే 2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండవ స్థానం సొంతం చేసుకుంది. అదే సంవత్సరం జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొంది. శోభిత ధూళిపాళ్ల. 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 తొలిసారిగా నటించింది. తర్వాత 2017 లో చెఫ్, కళాకంది అనే హిందీ సినిమాలలో నటించిన తర్వాత 2018లో గూడచారి సినిమా ద్వారా తెలుగులో తెరంగేట్రం చేసింది.
తర్వాత పోనియన్ సెల్వన్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. మేడిన్ హెవెన్, బర్డ్ అఫ్ బ్లడ్, మేనేజర్ వెబ్ సిరీస్లు కూడా చేసింది ఈ భామ. ఏది ఏమైనాప్పటికీ తెనాలిలో ప్రారంభమైన ఆమె జర్నీ హాలీవుడ్ వరకు పాకిందంటే నిజంగా ఎంతోమంది ఆడపిల్లలకి ఈ ప్రయాణం స్పూర్తి దాయకం. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్లని సోషల్ మీడియాలో పెట్టి కుర్ర కారు గుండెల్లో గుబులు రేపుతో ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది.