గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున మూవీ హీరోయిన్..! ఇలా అయిపోయింది ఏంటి..?

Ads

సూపర్ సినిమాలో అనుష్కతో పాటు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మరొక నటి ఆయేషా టాకియా. 2004 లో టార్జాన్: ది వండర్ కార్ అనే బాలీవుడ్ యాక్షన్ చిత్రంతో సినీ ప్రవేశం చేసింది ఆయేషా. ఈ సినిమాలో తన నటనకి ఫిలింఫేర్ బెస్ట్ డెబ్యూట్ అవార్డ్ సంపాదించుకుంది.

తర్వాత బాలీవుడ్ లో వరుసగా సినిమాలలో నటిస్తూ మంచి ఫేమ్ ని తెచ్చుకుంది ఆయేషా. వాంటెడ్ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించి మంచి పాపులారిటీని తెచ్చుకుంది.

nagarjuna super movie heroine ayesha takia new look

ఏప్రిల్ 10, 1986లో బొంబాయిలో పుట్టిన ఈ భామ మోడలింగ్ తో తన కెరీర్ ని మొదలుపెట్టి అలా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది షాహిద్ కపూర్ సరసన దిల్ మాంగే మోర్ చిత్రంలో కూడా నటించి అలరించింది. 2004లో విడుదలైన చిత్రానికి అంత మంచి రెస్పాన్స్ రాలేదు. దాని తర్వాత సంవత్సరమే తెలుగులో నాగార్జున సరసన 2005లో సూపర్ మూవీలో నటించి అలరించింది.

nagarjuna super movie heroine ayesha takia new look

Ads

ఈ సినిమాలో డాక్టర్ శ్రీ వల్లిగా అలరించిన ఆయేషాకి బెస్ట్ డెబ్యూట్ యాక్టరస్ నామినేషన్ కూడా పడింది. తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిన ఆయేషా పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ప్రియాంక చోప్రా, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, జాన్ ఇబ్రహీం లాంటి పెద్ద పెద్ద నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంది. బాలీవుడ్ లో నటించిన సినిమాలు అంత పెద్ద హిట్ కాకపోయినా ఆయేషా యాక్టింగ్ కి మాత్రం మంచి రెస్పాన్స్ ఏ వచ్చేది.

nagarjuna super movie heroine ayesha takia new look

ఇంక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2009లో తన బాయ్ ఫ్రెండ్ అయిన ఫర్హాన్ అజ్మీ నీ 23 ఏళ్లపుడు పెళ్లి చేసుకున్న ఆయేషా తర్వాత సినిమాలకు దూరమైంది. సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా ఆయేషాకి వైల్డ్ లైఫ్ అంటే అమితమైన ఇష్టం ఉంది. పెళ్లయిన తర్వాత ఇండస్ట్రీలో పెద్దగా కనిపించని ఆయేషా చాలా సంవత్సరాలు తర్వాత మళ్లీ ఈమధ్య మీడియాకు దర్శనం ఇచ్చింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సూపర్ సినిమా హీరోయిన్ ని చూసి అభిమానులందరూ అవాక్కయ్యారు. ఇలా అయిపోయింది ఏంటి అంటూ షాక్ అయ్యారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Previous articleతెనాలి నుండి… హాలీవుడ్ వరకు..! తెలుగు అమ్మాయిల సత్తా నిరూపించిన ఈ నటి గురించి ఈ విషయాలు తెలుసా..?
Next articleవైయస్ షర్మిల కొడుకు పెళ్లికి వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరు అవ్వట్లేదా..? కారణం ఇదేనా..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.