Ads
ఈమధ్య కాలంలో కన్నడ చిత్రాల హవా ఎక్కువగా కనిపిస్తోంది. మొదట కేజీఎఫ్, కేజీఎఫ్ 2 ఆ తరువాత రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.
ఈ సినిమా బడ్జెట్ 16 కోట్లు. అయితే ఈ మూవీ 400 కోట్లను కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది. ఇక కర్ణాటకలో అయితే ఏకంగా కేజిఎఫ్ సినిమా రికార్డులను బ్రేక్ చేసి, అందరిని ఆశ్చర్యపరిచింది. తెలుగులో రిలీజ్ అయిన ఈ మూవీ 25 కోట్ల లాభాలను రాబట్టింది. రిషబ్ శెట్టి కాంతార సినిమాకు దర్శకత్వం చేయడమే కాకుండా హీరోగా కూడా నటించారు. ఈ మూవీని కేజీఎఫ్ ప్రొడ్యూసర్స్ నిర్మించారు. నార్త్ లో కూడా 100 కోట్లకు పైగా వసూల్ చేసింది.ఇక ఈ సినిమా కర్ణాటక రాష్ట్ర భూత కోలా అనే సాంప్రదాయం ఆధారంగా తెరకెక్కించారు.భూత కోలా ఎపిసోడ్ లో థ్రిల్ కలిగించే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. అన్నిటి కన్నా సినిమా చివరలో వచ్చే సన్నివేశాలు చూస్తున్నవారికి గుజ్ బంప్స్ వచ్చేలా ఉంటాయి. థియేటర్లలో చూసిన ఆడియెన్స్ కి చాలా నచ్చింది. ఇక కాంతార సినిమా ఎప్పుడు అయితే ఓటీటీలో విడుదల అయ్యిందో, అప్పటి నుండి ఈ సినిమాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలు అయ్యాయి.
Ads
ఎందుకంటే నెటిజన్స్ ఇప్పుడు ఈ మూవీలోని లాజిక్స్ ని వెతుకుతున్నారు. సినిమాని ట్రోల్ కూడా చేస్తున్నారు. కాంతర మూవీలో మొదట్లో గ్రామ ప్రజలందరు రాజుకు తాము పూజించే దేవుడిని ఇచ్చి, తాము నివసించడానికి భూమిని ఇవ్వాలని కోరుతారు. అప్పుడు ఆ రాజు అలాగే చేస్తాడు. కానీ రాజు చనిపోయిన తరువాత ఆయన వారసుడు ఆ గ్రామ ప్రజలకు రాజు ఇచ్చిన భూమిని లాక్కోవడానికి చూస్తాడు. అయితే అప్పుడు కోలం ఆడుతున్న వ్యక్తి కోర్టు మెట్లపై రక్తం కక్కి చనిపోతావని అతన్ని హెచ్చరిస్తాడు. అయితే అతను చెప్పినట్టే వారసుడు చనిపోతాడు.
చాలా ఏళ్ల తరువాత ఆ రాజా కుటుంబానికి చెందిన మరో వ్యక్తి వచ్చి, ప్రజలు నివసించే భూమిని లాక్కోవాలని ప్రయత్నిస్తాడు. ఇక అదే సమయంలో కోళం ఆడుతున్న వ్యక్తిని చంపేస్తాడు. ఇక ఇక్కడే ఆడియెన్స్ లాజిక్ ని అడుగుతున్నారు. మూవీ మొదట్లో దైవ శక్తి రాజు వారసుడిని చంపేసినపుడు, రెండో సారి కోలం ఆడిన వ్యక్తిలోని దైవశక్తి రాజు వారసుడి గురించి గ్రామ ప్రజలకు చెబితే అప్పుడు ఏ సమస్య ఉండక పోయేది కదా. డైరెక్టర్ ఈ లాజిక్ ను ఎలా మర్చిపోయాడు అని అడుగుతున్నారు.
Also Read: మసూద సినిమాలో నజియా క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా?