మసూద సినిమాలో నజియా క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా?

Ads

టాలీవుడ్ సినిమాలలో మారిచిపోలేని పాత్రలు చాలా ఉన్నాయి. కాబట్టి ఒకటో, రెండో చెప్పడం అంటే చాలా కష్టమైన విషయమనే చెప్పాలి. ఇక ఏదైనా ఒక మూవీలోని ఏదైనా ఒక క్యారెక్టర్ అద్భుతంగా ఉంది అనగానే, ఆ క్యారెక్టర్ గురించి, ఆ పాత్రలో నటించిన నటీనటుల గురించి కూడా ఆరా తీయడం ప్రారంభిస్తారు.

Ads

ఆ తరువాత ఆ చిత్రాలను మళ్లీ చూడడం కూడా ఆ క్యారెక్టర్ వల్లే అని చెప్పాలి. ఇక ఆ పాత్రలో నటించింది ఎవరు, వాళ్ళ నేపద్యం ఏమిటి అనే వాటిపై చాలా ఆత్రుతను చూపిస్తారు. ఇలా ఉండగా ఇటీవల మసూద అనే సినిమా విడుదల అయ్యింది. మసుద సినిమాలో నజియా అనే పాత్రలో నటించింది ఎవరు అనే విషయం పై మూవీ చూసిన వారు ఎక్కువగా మాట్లాడుకున్నారు. నజియా పాత్రలో దయ్యం పట్టిన అమ్మాయిగా నటించిన నటి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజెన్స్ చర్చలు జరుపుతున్నారు. ఇక నజియా క్యారెక్టర్ లో నటించిన నటి, ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి చూద్దాం. నజియా క్యారెక్టర్ చేసిన నటి పేరు బాంధవీ శ్రీధర్. నజియా క్యారెక్టర్ లో బాంధవి అద్భుతంగా నటించింది. థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిందనే చెప్పొచ్చు.
బాంధవీ గుంటూరు జిల్లాకు చెందిన అమ్మాయి. ఆమె మోడలింగ్ ద్వారా సినిరంగంలోకి అడుగుపెట్టింది. బాంధవి 2019లో మిస్ ఇండియా రన్నరప్ గా నిలిచింది. ఇక ఆ సంవత్సరం మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ గా ఎన్నికైంది. అంతేకాకుండా మిస్ ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్ లో కూడా గెలిచింది.బాంధవి వ్యక్తిగత విషయాల్లోకి వస్తే, ఆమె తండ్రి ఇరవై ఏళ్ల నుండి సినిపరిశ్రమలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. అందువల్ల బాంధవికి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది.పేరెంట్స్ ప్రోత్సహంతోనే మోడలింగ్ కి వెళ్ళింది. ఇక హీరోయిన్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నప్పుడే మసూద సినిమాలో అవకాశం రావడం, ఈ మూవీలోని నజియా క్యారెక్టర్ నచ్చడంతో ఓకే చెప్పిందంట. మరి హీరోయిన్ అవ్వాలనుకుంటున్న బాంధవీ శ్రీధర్ కి ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.

Also Read: ‘పుష్ప సీక్వెల్ తో పాటు వచ్చే ఏడాది రాబోతున్న మరిన్ని సీక్వెల్స్!

Previous articleఅలీ ప్రేమకథ మరియు బ్రేకప్ గురించిన ఈ విషయాలు తెలుసా?
Next article‘అన్ స్టాపబుల్’ షో.. పవన్ ఎపిసోడ్ లో బాలయ్య సెన్సేషనల్ కామెంట్స్..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.