Ads
తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి నటసింహం బాలకృష్ణ తనదైన శైలిలో చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. సంక్రాంతి బరిలోకి దిగి, వీరసింహరెడ్డి మూవీతో సూపర్ హిట్ ని అందుకున్నారు బాలకృష్ణ. ఆయన అభిమానులను మెప్పించే సినిమాలు చేయడం కోసం కృషి చేస్తుంటారు. ఏ హీరోకి లేని విధంగా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Ads
ఇక ఆయన అభిమానులకు బాలయ్య చిత్రాలలో ఎక్కువగా నచ్చేది ఏమిటంటే ఆయన చెప్పే డైలాగ్స్. బాలయ్య మూవీ అంటే డైలాగ్స్ మినిమమ్ అయినా ఉండాల్సిందే అంటారు ఆయన ఫ్యాన్స్. ఎంత పెద్ద డైలాగు అయిన బాలకృష్ణ సింగిల్ టేక్ లోనే చెప్తారు. అది పౌరాణికం అయినా, మాస్ డైలాగ్ అయినా బాలయ్య సింగిల్ టేక్ లో ఓకే చెప్పేస్తాడు. ఇక బాలయ్య డైలాగులకు చెప్తుంటే థియేటర్స్ మోత మోగు తుంటాయి. బాలయ్య సినిమాలలో ముఖ్యంగా ఫ్యాక్షన్ నేపద్యంలో వచ్చే సినిమాలలో బాంబుల కన్నా ఎక్కువగా డైలాగులే ఎక్కువగా పేలుతాయి.
బాలకృష్ణ కెరీర్ లో ఇప్పటి వరకూ ఆయన చెప్పిన డైలాగ్స్ లో ఫ్యాన్స్ కు ఫేవరెట్ అయిన డైలాగ్స్ చాలా ఉన్నాయి. బాలయ్య చెప్పిన డైలాగ్స్ లో నరసింహనాయుడు మూవీలో బాలయ్య, ముకేష్ ఋషితో చెప్పిన ‘కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా’ డైలాగ్ ను ఇప్పటికి కూడా చాలా మంది వాడుతూ ఉంటారు. ఆ డైలాగ్ నందమూరి ఫ్యాన్స్ ని అంతగా ఆకట్టుకుంది. నరసింహనాయుడు సినిమాలో కత్తి కంటే కూడా బాలకృష్ణ కంటికి ఉండే శక్తిని వివరిస్తూ చెప్పిన డైలాగ్ ఇది.
అయితే ఈ డైలాగును ఎన్టీరామరావుగారు నిజ జీవితంలో చెప్పారనే విషయం చాలా మందికి తెలియదు. ఈ డైలాగ్ ను పరుచూరి గోపాల కృష్ణ రాశారు. ఆయన నరసింహనాయుడు సినిమాకు మాటలు అందించారు. పరుచూరి గోపాలకృష్ణ ఎన్టీరామరావుగారు నటించిన ‘నాదేశం’ అనే సినిమాకి కూడా రచయితగా ఉన్నారు. నాదేశం చిత్రంలో క్లైమాక్స్ లో మాత్రమే ఒకే ఫైట్ ఉంటుంది. అయితే ఆ సినిమా డైరెక్టర్ బాప్పయ్య మరో ఫైట్ కూడా పెట్టాలని భావించారంట. అయితే ఆ విషయం గురించి ఎన్టీఆర్ కు చెప్పే ధైర్యం లేక పరుచూరి గోపాలకృష్ణకు ఆ పనిని అప్పగించారట.
దాంతో ఒకసారి కారులో వెళుతున్నప్పుడు పరుచూరి గోపాలకృష్ణ అన్నగారూ మీకున్న మాస్ ఇమేజ్ కు ఈ సినిమాలో ఇంకో ఫైట్ ఉంటే బాగుంటుందని చెప్పారంట. దానికి ఎన్టీఆర్ దేనికైనా ఓ పరిధి ఉంటుంది కదా. ఫైట్ కావాలంటే సత్యనారాయణతో చెప్పండి. నేను కన్నెర్ర చేస్తేనే వాళ్లు గుండె ఆగి చస్తారని చెప్పారంట. పరుచూరి గోపాలకృష్ణ అప్పుడు జరిగిన ఘటనను స్పూర్తిగా తీసుకొని ఇరవై ఏళ్ల తరువాత నరసింహనాయుడు సినిమాలో పెట్టారట. ఇక ఈ డైలాగ్ నరసింహనాయుడు సినిమాకే హైలైట్.
Also Read: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 15 రీమేక్ సినిమాల లిస్ట్..