Ads
చాలా మంది కాశీ వెళుతూ ఉంటారు. కాశీ లో కొన్ని రోజులు పాటు ఉంటే చాలా మంచిదని అక్కడకి వెళ్లి కూడా చాలా మంది నివసిస్తూ ఉంటారు. 12 జ్యోతిర్లింగాలయాల్లో కాశీ విశ్వేశ్వర ఆలయం కూడా ఒకటి. కేవలం మన దేశం లో ఉండే భక్తులు మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు వస్తూ ఉంటారు. అయితే కాశీ విశ్వేశ్వరుడి ఆలయంలో ఒక వింత ఉంది.
అదేంటంటే.. మామూలుగా ఏ దేవాలయంలో అయినా మనం చూస్తే శివుడికి ఎదురుగా నంది ఉంటుంది. మనం మొదట నందిని దర్శించుకుని తర్వాత శివుడుని దర్శించుకోవడానికి వెళుతూ ఉంటాం.
Ads
ఎప్పుడైనా కాశీ విశ్వేశ్వరుడిని చూసినప్పుడు మీకు ఈ సందేహం కలిగిందా…? ఎందుకు మామూలు శివాలయాల్లో నంది ఉంటారు..? కాశీ విశ్వేశ్వరుడి ఆలయంలో నంది ఉండరు అని.. దాని వెనుక కారణం ఇక్కడ ఉంది. మరి మీరు కూడా చూసేయండి. అప్పట్లో ఔరంగజేబు భారతదేశంపై దండెత్తినప్పుడు… అన్ని ఆలయాలను తాను కూల్చేయాలని అనుకున్నాడు. ఆ పనిలో వున్నాడు. అలా కాశీ లో వుండే ఈ ఆలయాన్ని కూడా ఔరంగజేబు భారతదేశంపై దండెత్తినప్పుడు ధ్వంసం చేసేసాడు. ఔరంగజేబు సైన్యం కాశీ వచ్చి విశ్వేశ్వర ఆలయంను ధ్వంసం చేస్తుంటే ఆ ఆలయ అర్చకులు ఏం చేసారంటే గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని తీసుకు వెళ్లి ఒక బావి లో పడేసారు.
ఔరంగజేబు సైన్యం ఈ ప్రధాన ఆలయాన్ని ఇంచుమించు ధ్వంసం చేయడం జరిగింది. కానీ కొద్దిగా శిథిలాలు మిగిలాయి. తరువాత జ్ఞాన్వాపి మసీదును అక్కడ కట్టారు. ఒకప్పుడు ఈ ఆలయం లో శివలింగానికి ఎదురుగా నంది వుంది. కానీ ఆ నందిని మాత్రం ధ్వంసం చేయలేదు. అందుకే ఆ పాత నంది అక్కడే వుంది. బావి నుంచి శివలింగాన్ని తరవాత తీద్దామని అనుకున్నారు కానీ అది దొరకలేదు. దీనితో ఆ లింగం లాగ వుండే శివలింగాన్ని చేసి ఒక ఆలయం ని కట్టారు. కానీ ఇక్కడ నందిని పెట్టలేదు. పాత ఆలయం వద్దనే నంది ఉంటుంది.