ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇప్పుడు తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది..! ఎవరో తెలుసా..?

Ads

ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు. సమయం మారుతున్న కొద్ది హీరోయిన్ల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. అయితే, ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా, ఒక భాష హీరోయిన్ వేరే భాష ఇండస్ట్రీకి వెళ్లి సినిమాలు చేస్తున్నారు.

అలా ఇటీవల కాలంలో బాలీవుడ్ నుండి చాలా మంది హీరోయిన్లు టాలీవుడ్ కి రావడం జరుగుతోంది. టాలీవుడ్ నుండి హీరోయిన్లు కూడా బాలీవుడ్ కి వెళ్తున్నారు. సినిమాలు పాన్-ఇండియన్ రేంజ్ లో విడుదలవుతున్నాయి కాబట్టి, మార్కెట్ కి తగ్గట్టుగా హీరోయిన్ ని ఎంచుకుంటున్నారు.

childhood picture of heroine

హీరోయిన్ మాత్రమే కాదు. సినిమా ప్రతి చోట ప్రమోట్ అవ్వాలి అంటే ఆ భాషకు చెందిన నటులు కూడా ఉంటే అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అందుకే వేరే భాష ఇండస్ట్రీకి చెందిన నటులని మన సినిమాల్లో తీసుకుంటున్నారు. అందుకు కారణం, మన సినిమాని అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. అలా ఇటీవల తెలుగులో ఒక హీరోయిన్ కి ఇప్పుడు డిమాండ్ పెరిగిపోయింది. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి తనే. ఇది ఆమె చిన్నప్పటి ఫోటో. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న ఆ హీరోయిన్, ఇప్పుడు రామ్ చరణ్ తో కూడా సినిమా చేస్తున్నారు.

Ads

ఈ విషయాన్ని ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా సినిమా బృందం ప్రకటించారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు. జాన్వీ కపూర్. శ్రీదేవి, బోని కపూర్ పెద్ద కూతురు అయిన జాన్వీ కపూ,ర్ ఇవాళ తన 27వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. దేవర సినిమా బృందం జాన్వీ కపూర్ పోస్టర్ ఒకటి విడుదల చేశారు. రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ అని ఇవాళ ప్రకటించారు.

childhood picture of heroine

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా జరుగుతున్నాయి. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహిస్తారు. ఆ విషయాన్ని కూడా ఇటీవల ప్రకటించారు. సూర్యతో కూడా జాన్వీ కపూర్ ఒక సినిమాలో నటిస్తున్నారు అనే వార్త వచ్చింది. కానీ ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది అధికారిక ప్రకటన వచ్చేంత వరకు తెలియదు. ప్రస్తుతం అయితే జాన్వీ తెలుగు సినిమాలతోనే బిజీ అయిపోతున్నారు అని లైన్ అప్ చూస్తుంటేనే అర్థం అవుతోంది.

ALSO READ : కార్తీకదీపం-2 స్టోరీ ఏంటో తెలుసా..? ఆ సీరియల్ కి రీమేక్..?

Previous articleకాశీ విశ్వేశ్వరుడి ఆలయంలో శివుడికి ఎదురుగా నంది ఎందుకు ఉండదో తెలుసా.?
Next article38 ఏళ్ళ రామ్ చరణ్ కి తల్లిగా… 37 ఏళ్ళ హీరోయిన్..! ఇదెక్కడి వింత..?