Ads
ఆరోగ్యంగా ప్రతి ఒక్కరూ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ మధ్యకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలలో కిడ్నీ సమస్యలు కూడా ఒకటి. చాలా మంది కిడ్నీలు పాడవడం, కిడ్నీలో రాళ్లు చేరడం ఇలా వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయా అని అనుమానం మీకు కలిగిందా…? మీ కిడ్నీలో రాళ్లు ఉన్నాయా లేదా అనే సందేహం ఉంటే ఇలా చేయండి. మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలు కిడ్నీలు.
కిడ్నీలో రాళ్లు ఏర్పడితే విపరీతమైన నొప్పి ఉంటుంది అలానే ఈ ఇబ్బందులు కూడా ఉంటాయి. మరి కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయా అనే సందేహం ఉంటే ఇలా తెలుసుకోవచ్చు.
కిడ్నీ లో రాళ్లు ఉంటే మూత్ర విసర్జనప్పుడు నొప్పి, మంట వస్తుంది. అలానే వికారం, జ్వరం కూడా ఉంటాయి. అంతే కాక పొట్ట కింది భాగం లో నొప్పి వస్తూ ఉంటుంది. ఎక్కువ సార్లు యూరిన్ రావడం, యూరిన్ రంగు మారడం కూడా దీనికి లక్షణాలే.
Ads
ఈ విషయాలని కూడా తెలుసుకోండి:
కాల్షియం తక్కువ తీసుకునే వారిలో కిడ్నీ లో రాళ్లు ఎక్కువ ఫార్మ్ అయ్యే ఛాన్స్ వుంది. క్యాల్షియం రాళ్లు ఏర్పడేందుకు కారణమయ్యే ఆక్జలేట్స్‌ను అడ్డుకోవడం వలన ఈ సమస్య రాదు.
మూత్రాశయంలో కిడ్నీ స్టోన్స్ కనుక ఆగిపోతే.. వాళ్ళల్లో అలసట వస్తుంది. అలానే వణుకుతో కూడిన జ్వరం కూడా వస్తుంది.
కిడ్నీ స్టోన్స్ ఉంటే మూత్రంలో రక్తం కూడా వస్తుందిట. ఎరుపు, పసుపు మిక్స్ అయిన రంగులో ఉంటుంది మూత్రం.
మూత్రాశయం లోకి రాళ్లు కనుక వస్తే.. అప్పుడు అవయవాన్ని వాపులకు గురి చేస్తాయి.
అలానే ఈ స్టోన్స్ ఫార్మ్ అయినా మొదటి స్టేజ్ లో పొట్ట కింది భాగంలోని కానీ వెన్నులో కానీ నొప్పి వస్తుంది. ఒకసారి నొప్పి ఎక్కువ వస్తే ఒక్కోసారి తక్కువ వస్తుంది. సో జాగ్రత్తగా ఉండడం మంచిది.