ఈ పిల్లోడి కోసం బెంగళూరు నుండి స్పెషల్ ఫ్లైట్ వేశారా..? రెమ్యూనరేషన్ కూడా మామూలుగా లేదుగా..?

Ads

ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అని అప్పుడెప్పుడో ఒక యాడ్ లో చూసాము. ఇప్పుడు ఒక బాల నటుడి కెరియర్ లో అదే జరిగింది. ఒక వెబ్ సిరీస్ ఆ బాల నటుడి జీవితాన్ని మార్చేసింది. ఒక సాధారణ బాల నటుడు ఇప్పుడు స్టార్ చైల్డ్ యాక్టర్ అయిపోయాడు, అది కూడా ఓ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ. ఇంతకీ ఎవరా కుర్రాడు, ఏంటా వెబ్ సిరీస్ చూద్దాం రండి.

this man is recieving huge remuneration

నటుడు శివాజీ చాలా రోజుల తర్వాత #90s అనే వెబ్ సిరీస్ చేశాడు. ఈ మిడిల్ క్లాస్ బయోపిక్ సంచలన విజయం సాధించింది. ఈ సిరీస్ లో నటించిన నటులు అందరికీ నేమ్, ఫేమ్ పుష్కలంగా లభించాయి. ఈ సిరీస్ లో బిగ్ బాస్ శివాజీ తో పాటు తొలిప్రేమ ఫేమ్ వాసుకి, స్టాండ్ అప్ కమెడియన్ మౌళి, బాల నటుడు రోహన్ రాయ్ తో పాటు చాలామంది నటించారు.

Ads

అయితే అందరికన్నా ఎక్కువగా రోహన్ క్యారెక్టర్ క్లిక్ కావటం, వరస పెట్టి అతనికి ఆఫర్స్ రావడంతో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు రోహన్. సాంప్రదాయని.. సుప్పిని.. సుద్దపూసని అంటూ రోహన్ నవ్వులు పండించడం, అలాగే అతని కామెడీ టైమింగ్ తో అందరిని ఆకట్టుకోవటం సిరీస్ కి పెద్ద ప్లస్ అయింది. దాంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు రోహన్. ఇంక చెప్పేదేముంది వెంటనే రెమ్యునరేషన్ పెంచేశాడు మన సుద్ధ పూసని నటుడు.

తెలుగు పిల్లవాడే అయినప్పటికీ ఫ్యామిలీ బెంగళూరులో సెటిల్ అవ్వటంతో అతను అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వటమే కాకుండా రోహన్ కోసం స్పెషల్ ఫ్లైట్ లు కూడా అరేంజ్ చేసి తమ సినిమాలలో ఆక్ట్ చేయిస్తున్నారంట నిర్మాతలు. నిజానికి రోహన్ గతంలో పలు సినిమాలు, సీరియల్స్ లో నటించాడు. అప్పుడు రోజుకి 5000 రెమ్యునరేషన్ తీసుకునేవాడంట కానీ ఇప్పుడు రోజుకి 30000 తీసుకుంటున్నాడు ప్లస్ ఫ్లైట్ చార్జీలు అవి ఎగస్ట్రా. దిమ్మ తిరిగే ఈ రెమ్యూనరేషన్ చూసిన నెటిజన్స్ రోహనా..మజాకా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఇది ఒక స్టార్ హీరో రేంజ్ అనే చెప్పాలి

Previous articleమీ కిడ్నీలో రాళ్లు ఉన్నాయేమోనని సందేహమా..? అయితే ఇలా తెలుసుకోవచ్చు..!
Next articleచాణక్య నీతి: ఈ వ్యక్తులతో దయగా ఉండడమే మంచిది కాదు..!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.