Ads
అభివృద్ధి చెందడంతో మోటార్ సైకిల్స్, కార్లు, ఫ్లైట్ల మీద మనం ప్రయాణం చేస్తున్నాం. కానీ అప్పట్లో మాత్రం అందరూ గుర్రాలు మీద ప్రయాణం చేసేవారు. ముఖ్యంగా గుర్రాలు అనగానే మనకి గుర్తు వచ్చేది రాజులు. రాజులు కత్తి పట్టుకుని గుర్రం మీద వెళుతూ ఉండేవారు.
చాలా సినిమాల్లో మనం ఇలాంటివి చూస్తూనే ఉంటాము. ఛత్రపతి శివాజీ, రాణి రుద్రమ్మదేవి ఇలా రాజులు, రాణీలు గుర్రాల మీదే వెళ్లేవారు.
యుద్దాలప్పుడు కూడా గుర్రాలు ముఖ్యమైన పాత్ర పోషించేవి. గుర్రాలకి అంత ప్రాముఖ్యత ఇచ్చారు కాబట్టి రాజులు స్మృతి చిహ్నాలు ఉన్నచోట గుర్రాలు కూడా ఉంటాయి. పైగా ఇప్పుడు మనం ఎక్కడైనా రాజుల విగ్రహాలను చూస్తే రాజు గుర్రం మీద వుండినట్టు విగ్రహం ఉంటుంది. అయితే ఎప్పుడైనా మీరు ఈ విషయాన్ని గమనించారా..? అందరి గుర్రాలు విగ్రహాల మీద ఒకేలా వుండవు. గుర్రాలు వివిధ పొజిషన్స్ లో ఉంటాయి. మీరు కనుక చూసినట్లయితే కొన్ని గుర్రాలు గాల్లోకి రెండు కాళ్లు ఎత్తి నిలబడతాయి. కొన్ని గుర్రాలు కాళ్ళని కిందకి పెట్టి ఉంటాయి. అయితే గుర్రం ఉండే దానిని బట్టి మనం రాజు ఎలా చనిపోయాడు అనేది తెలుసుకోవచ్చు.
Ads
గుర్రం ఒక కాలు మాత్రమే పైకి లేపినట్లైతే బాగా దెబ్బలు తగిలి గాయాలు అవ్వడం వలన రాజు మరణించాడని దానికి సంకేతం. రుద్రమదేవి విగ్రహం మీద గుర్రం ఒక కాలు గాల్లోకి ఉంటుంది. యుద్ధం అయిపోయిన తర్వాత గాయాల వలన రుద్రమదేవి చనిపోయారు. అలానే ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ సింగ్ కూడా యుద్ధం తర్వాత తీవ్ర గాయాలయి చనిపోయారు. ఒకవేళ కనుక గుర్రం రెండు కాళ్ళ నేల మీద నిలబడి ఉంటే ఆ రాజు సహజ మరణాన్ని పొందారని దానికి సంకేతం. గుర్రం రెండు కాళ్లు గాల్లో ఉంటే యుద్ధం లోనే వారు వీరమరణం పొందినట్లు దానికి అర్థం.