Ads
వన్డే ప్రపంచకప్ 2023 లో బారత జట్టు తొలి మ్యాచ్ ను విజయంతో ప్రారంభించింది. చెన్నైలో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీంఇండియా ఆస్ట్రేలియా పై 6 వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. ఈ గెలుపుతో టీమిండియాకు రెండు పాయింట్లు లభించాయి. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ చివర్లో సిక్సర్ కొట్టి జట్టును గెలిపించాడు. అయితే సెంచరీ చేసే ఛాన్స్ కోల్పోయాడు. ఈ క్రమంలో నెటిజెన్లు, హార్దిక్ పాండ్యాని ట్రోల్ చేస్తున్నారు. మరి ఎందుకు ట్రోల్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
ఆస్ట్రేలియాతో ఆదివారం నాడు జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఆరంభంలోనే వరుసగా ముగ్గురు పరుగులు ఏమి చేయకుండానే అవుట్ అయ్యారు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లి 85 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 97 నాటౌట్ గా నిలిచాడు. టీమిండియా విజయంలో రాహుల్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో రాహుల్ ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించిన రాహుల్, మూడు పరుగుల తేడాతో శతకాన్ని చేసే ఛాన్స్ ను కోల్పోయాడు.
Ads
విన్నింగ్ షాట్ తరువాత ఒక్కసారిగా రాహుల్ కింద కూర్చున్నాడు. ఫోర్ వెళ్తుందనుకున్న షాట్, సిక్స్ వెళ్లడంతో తనలో తానే నవ్వుకున్నాడు. అదే సమయంలో రాహుల్ ఫేస్ లో సెంచరీ కోల్పోయాను అనే బాధ స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ తరువాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకునే సందర్భంగా రాహుల్ సెంచరీ మిస్ అవడం పై మాట్లాడుతూ, నిజానికి సెంచరీ తన ప్రణాళికలో ఉందని, సెంచరీని పూర్తి ఎలా చేయాలనేది ఆలోచించాను.
ముందు బౌండరీ, ఆ తరువాత సిక్సర్‌తో సెంచరీ సాధ్యపడుతుందని భావించానని, అయితే మొదటిదే సిక్సర్‌గా వెళ్లిందని చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే కేఎల్ రాహుల్ సెంచరీ మిస్ కావడానికి కారణం హార్దిక్ పాండ్యా అని నెటిజెన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. హార్దిక్ సిక్స్ కొట్టకకుండా ఉంటే రాహుల్ సులభంగా సెంచరీ చేసేవాడని కామెంట్స్ చేస్తున్నారు. పాండ్యా మోస్ట్ సెల్ఫిష్ క్రికెటర్ అని ట్రోల్ చేస్తున్నారు. గతంలో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో కూడా తిలక్ వర్మ 49 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు సింగిల్ తీయకుండా సిక్స్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు హార్దిక్. దీంతో తిలక్ హాఫ్ సెంచరీ మిస్ అయింది. అప్పుడు కూడా హార్దిక్ ని ఇలాగె ట్రోల్ చేసారు.