మీ “పిడికిలి” ని బట్టి మీరు ఎలాంటి వారు అనేది చెప్పేయొచ్చు… ఎలానో తెలుసా..?

Ads

చేతిరాత ద్వారా చేతిలో ఉండే రేఖలు ద్వారా పిడికిలి బిగించే స్టైల్ ద్వారా మన పర్సనాలిటీ గురించి చెప్పవచ్చు. పిడికిలి బిగించే విధానం బట్టి కూడా పర్సనాలిటీ గురించి చెప్పచ్చు మీ వ్యక్తిత్వాన్ని ఎలాంటిది.. మీరు ఎలా ఉంటారు అనేది పిడికిలి బిగించేటప్పుడు బొటనవేలు ని లోపలికి పెడుతున్నారా లేదంటే బొటనవేలు ని బయటకు పెడుతున్నారా.. ఇవి చూసి చెప్పేయచ్చు. ఇక ఇప్పుడే మీ పర్సనాలిటీ గురించి చూడండి.

పిడికిలి బిగించేటప్పుడు చూపుడు వేలు పైన బొటనవేలు:

ఇలా ఉంటే మీలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని దానికి అర్థం మీ లక్ష్యాల కోసం మీరు విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తారు. అలానే ఏకాగ్రత కలవారు. మీరు ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటారు. కొత్త విషయాలు కొత్త ప్రాంతాల గురించి మీకు తెలుసుకోవడం ఎంతో ఇష్టం. ఇతరులకి మీరు మార్గదర్శకంగా నిలుస్తారు. అన్యాయం చేసి సహించరు. కరుణా, నాయకుడు, స్థిరత్వం, దృఢత్వం, సాధకుడు, అన్వేషకుడు, తెలివి, ఇతరులకు సహాయం చేయడం మీలో ఉండే ముఖ్య లక్షణాలు.

Ads

బొటనవేలు ని బయట ఈ విధంగా పెట్టడం:

మీరు కనుక పిడికెలని బిగించేటప్పుడు ఈ విధంగా బొటనవేలు ని బయటపెడుతున్నట్లయితే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటాయి. మీపై విశ్వాసం నమ్మకాన్ని మీరు కలిగి ఉంటారు. అలానే సూటిగా మాట్లాడుతారు. నిజాయితీగా ఉంటారు. ఆనందంగా అప్పుడే ఉంటుంది మీకు. మీ జీవితం రొటీన్ గా ఉండడాన్ని మీరు ఇష్టపడరు. ఆత్మగౌరవం, సృజనాత్మకత, ఆలోచన విధానం, ప్రభావితమైన కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ కూడా మీలో ఉండే ముఖ్య లక్షణాలు.

బొటనవేలు లోపల ఉండడం:

పిడికిలి బిగించినప్పుడు మీ బొటనవేలు లోపల ఉంటే మీరు ఇంట్రావర్ట్. గోప్యతని ఇష్టపడతారు. మీరు బిజినెస్ చేయడం మంచిది. సృజనాత్మకంగా మీరు ఉంటారు. ఎప్పుడూ కూడా అవుట్ అఫ్ ది బాక్స్ ఆలోచన చేస్తారు. తక్కువ మాట్లాడుతారు. మీరు ఎక్కువ వింటారు. మీరు రిలేషన్షిప్ పట్ల ఫ్రెండ్స్ కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటారు. కష్టకాలంలో కూడా ఏ మాత్రం ఆలోచించరు. సానుభూతి, పుకార్లు ఇష్టపడని తత్వం, ఎమోషనల్ మీలో ఉండే ముఖ్య లక్షణాలు.

Previous articleఅమ్మవారికి నిమ్మకాలయతో చేసిన దండలని ఎందుకు వేస్తారు..? కారణం ఇదే..!
Next articleజనరిక్ మందులు ఎందుకు అంత తక్కువ ధరకే వస్తాయి..? కారణం ఏమిటి అంటే..?