స్టార్ డైరెక్టర్ ను బిర్యానీ తీసుకు రమ్మని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్..

Ads

జూనియర్ ఎన్టీఆర్ నటుడిగా ఎంతగా గుర్తింపును తెచ్చుకున్నారో అందరికి తెలిసిందే. ఈ స్టార్ హీరో మంచి యాక్టర్ మాత్రమే కాదు, భోజన ప్రియుడు. గతంలో ఆయన పలు సందర్భాలలో తాను భోజన ప్రియుడు అవటం వల్లే అధిక బరువు పెరిగానని తెలిపారు. దాంతో ఎన్టీఆర్ ఆహార విషయంలో కొన్ని నియమాలు పెట్టుకున్నట్లుగా సమాచారం. హైదరాబాద్ బిర్యానీ అనేది ఎంతగా ఫేమస్ అయ్యిందో అందరికి తెలిసిందే.

Ads

అయితే ఎంతో మంది హైదరాబాద్ బిర్యానీని ఇష్టపడుతుంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మాత్రం చెన్నై బిర్యానీని ఎంతగానో ఇష్టం పడతారట. ఈ విషయాన్ని ప్రముఖ డైరెక్టర్ కోదండరామిరెడ్డి కొడుకు సునీల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ కు చెన్నై బిర్యానీ తినడానికి అంటే చాలా ఇష్టపడతాడని చెప్పారు. ఆయన ఇంకా ఇలా చెప్పుకొచ్చారు. ఒకసారి ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ చెన్నైలో బాగా పాపులర్ అయిన తలపాకట్టిన బిర్యానిని ఆర్డర్ చేశారు. దాంతో నేను ఆ బిర్యానీ ఆర్డర్ తన కోసమే అనుకోని ఇక్కడే ఉండి ఆర్డర్ పెట్టడం ఎందుకు వెళ్లి తినొచ్చు కదా అని అన్నాను.
అప్పుడు అట్లీ ఈ బిర్యాని తన కోసం కాదని, హైదరాబాద్ లో ఉండే తెలుగు హీరో ఎన్టీఆర్ కి అనడంతో నేను ఆశ్చర్యపోయాను. స్టోరి చెప్పడానికి హైదరాబాద్ కి వస్తున్నాను అని చెప్తే ఎన్టీఆర్ ఈ బిర్యాని తెమ్మని చెప్పారు. అందువల్లే చెన్నై నుండి డైరెక్టర్ అట్లీ ఎన్టీఆర్ కోసం తలపాకట్టిన బిర్యానీని తీసుకువచ్చారని సునీల్ తెలియచేసారు.
అయితే ఎంతో మంది సినీ ప్రముఖులు హైదరాబాద్ బిర్యానీ ఇష్టపడితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మాత్రం తలపాకట్టిన బిర్యానీ అంటే ఇష్టమని తెలిపారు. ఇక ఎన్టీఆర్ చిత్రాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 35వ సినిమాని చేయనున్నారు. ఈ మూవీ పూర్తయిన తరువాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీతో బిజీ కానున్నారు.
Also Read: కట్టప్ప అలియాస్ సత్యరాజ్ కుమార్తె ఎలా ఉందో తెలుసా?

Previous articleసూపర్ స్టార్ రజినీ కాంత్‌ భార్య లత ఆయనను ఎందుకు ఇష్టపడ్డారో తెలుసా?
Next articleమెగాస్టార్ చిరంజీవికి రీమేక్ సినిమాలు చేయవద్దని లెటర్ రాసిన మెగాఫ్యాన్..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.