కట్టప్ప అలియాస్ సత్యరాజ్ కుమార్తె ఎలా ఉందో తెలుసా?

Ads

రంగరాజ్ సుబ్బయ్య అని చెప్పినప్పుడు చాలా మందికి తెలియకపోవచ్చు. అదే సత్యరాజ్ అనగానే వెంటనే బాహుబలి కట్టప్ప కదా అంటారు. సత్యరాజ్ తెలుగు, తమిళం తో పాటుగా పలు భాషల్లో విలక్షణమైన పాత్రలలో నటిస్తూ రాణిస్తున్నారు.

సత్యరాజ్ గతంలో ఒక స్టార్ హీరో. కోలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా అప్పట్లో ఒక వెలుగు వెలిగారు. ఆయన కెరీర్ లో హీరోగా చాలా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. టాలీవుడ్ ఆడియెన్స్ కి మాత్రం సత్యరాజ్ కట్టప్పగా సూపరిచితమే. ఆయన తెలుగులోనూ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే సత్యరాజ్ కుటుంబం గురించి అంతగా ఎవ్వరికి తెలియదని చెప్పవచ్చు. ప్రస్తుతం సత్యరాజ్ కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగాక దాదాపుగా అందరు వెలుగులోకి వస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు వెలుగులోకి వచ్చేదాకా తెలియదు. వారు సెలబ్రిటీల పిల్లలు అని, లేదా బంధువులని. అలా సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చిన వారు సినిమా హీరోయిన్ లకు కానీ, హీరోలకు కానీ తీసిపోని విధంగా ఉండడం విశేషం. అలా వచ్చిన వారి జాబితాలోకి తాజాగా యాక్టర్ సత్యరాజ్ అలియాస్ కట్టప్ప కుమార్తె దివ్య సత్యరాజ్ సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సత్యరాజ్ కుటుంబం పెద్దగా తెలియదు. సత్యరాజ్ సతీమణి పేరు మహేశ్వరి. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. వారు కొడుకు సిబిరాజ్, కూతురు దివ్య సత్యరాజ్. అయితే ఇప్పటికే సత్యరాజ్ కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సిబిరాజ్ డోరా, మాయోన్ లాంటి సినిమాలలో నటించి మెప్పించాడు. కట్టప్ప కుమార్తె దివ్య సత్యరాజ్ గురించి అయితే అభిమానులకు కూడా పెద్దగా తెలియదు. దానికి కారణం దివ్య ఎక్కువగా బయట కనిపించ లేదు.దివ్య సత్యరాజ్ న్యూట్రిషనిస్ట్ గా కొనసాగిస్తోంది. తాజాగా దివ్య సత్యరాజ్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవడంతో నెటిజన్స్ చాలా రకాలుగా కామెంట్స్ పెడుతున్నాడు. మీరు హీరోయిన్ లా ఉన్నారని, సినిమాలలో నటించవచ్చు కదా అని కొందరు కామెంట్ చేయగా, హీరోయిన్ లా అందంగా ఉన్నారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: పునీత్ రాజ్ కుమార్ టూ తారకరత్న.. ఇటీవల కాలంలో గుండెపోటుతో కన్నుమూసిన 7గురు సెలెబ్రిటీలు..

Ads

 

View this post on Instagram

 

A post shared by Divya Sathyaraj (@divya_sathyaraj)

Previous articleహాలీవుడ్ సినిమాల పోస్టర్లను కాపీ కొట్టిన 11 తెలుగు చిత్రాలు ఇవే..
Next articleమంచు మనోజ్ పెళ్లి ఆ స్టార్ హీరోయిన్ లాగే చేసుకున్నాడా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.