త్వరలో పెళ్లి చేసుకొనున్న కృష్ణ ముకుంద మురారీ హీరోయిన్.. కాబోయే భర్తను పరిచయం చేసిన కృష్ణమ్మ..!

Ads

ఎన్ని సినిమాల వచ్చినా కూడా సీరియల్స్‌ కి ఆదరణ పెరుగుతూనే ఉంది. సంవత్సరాల తరబడి ప్రసారం అవుతూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాయి. కొన్ని సీరియల్స్‌ చాలా ఫేమస్‌ అవుతున్నాయి. ఎంతగా అంటే ఆ సీరియల్స్‌ లోని ముఖ్య పాత్రలను కుటుంబ సభ్యుల్లా భావించే అంతగా.

ప్రసుత్తం బుల్లితెర పై ప్రసారం అవుతున్న సీరియల్స్‌ లో కృష్ణ ముకుంద మురారీ సీరియల్‌ ఒకటి. ఇది  ఆడియెన్స్ అభిమానాన్ని పొంది, టీఆర్పీ రేటింగ్‌ లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది ఈ సీరియల్‌. దీనిలో లీడ్ రోల్ లో నటిస్తున్న కృష్ణ తన రియల్ లైఫ్ హీరోని ఫ్యాన్స్ కి పరిచయం చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కృష్ణ ముకుంద మురారీ సీరియల్ కొంతకాలం నుండి తెలుగులో టాప్ రేటింగ్ తో కొనసాగుతోంది. ఇందులో కృష్ణ, ముకుంద, మురారీ లీడ్ రోల్స్ తోపాటుగా సీరియల్‌లో నటిస్తున్న అందరూ తమ క్యారెక్టర్స్ లో ఒదిగిపోయారు. ఈ సీరియల్ లో కృష్ణ, తనను ఇష్టం లేకుండా, తండ్రి అభీష్టం మేరకు పెళ్లి చేసుకున్న మురారీని ప్రేమించి, భర్త ప్రేమని పొందాలని ఆరాటపడే పాత్ర. ఇక కృష్ణ మంచితనం, మొండితనం, అమాయకత్వం లాంటి లక్షణాలతో తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ పాత్రలో నటించిన అమ్మాయి పేరు ప్రేరణ కంబం.
ప్రేరణ కన్నడ నటి. కన్నడ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించింది. అలాగే కన్నడ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2017లో, ప్రేరణ కన్నడలో ‘హర హర మహాదేవ్’ సీరియల్‌తో అడుగు పెట్టింది. ఆ తర్వాత రంగనాయకి తదితర సీరియల్స్‌లో నటించింది. 2018లో చూరికట్టె సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆనా, ఫిజిక్స్ టీచర్, పెంటగాన్ వంటి కొన్ని చిత్రాల్లో నటించింది. తెలుగు బుల్లితెరపై ‘కృష్ణా ముకుందా మురారి’ సీరియల్‌తో అడుగుపెట్టింది.
త్వరలో ప్రేరణ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఆమె ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రేరణ సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ తో పంచుకుంది. ఆమె పెళ్లిచేసుకోబోయే వ్యక్తి పేరు శ్రీపాద్. ఇద్దరు ఉన్న ఫోటోలను షేర్ చేసింది. దాంతో అభిమానులు కృష్ణకు విషెస్ చెబుతున్నారు.

Also Read: మనసు విరిగిన.. పరిస్థితులు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన మెగా డాటర్..!

 

Previous articleథాయిలాండ్ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్..! ఏమిటంటే..?
Next articleఇంగ్లాండ్, పాక్, శ్రీలంకల పై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయాల వెనుక ఉన్న ఇండియన్ ఎవరో తెలుసా.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.