Ads
టాలీవుడ్ లో హీరోలు ఎంత మంది ఉన్నా కొందరు మాత్రం తమదైన ముద్ర వేసి, ప్రత్యేక గుర్తింపు పొందుతారు. అలా ఈ తరం హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. నందమూరి వారసూడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ తన నటనతో అలరిస్తూ మాస్ హీరోగా ముందుకు సాగుతున్నాడు.
Ads
టాలీవుడ్ ఇండస్ట్రీ పాపులర్ కపుల్స్‌లో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి జంట ఒకటి. వీరి పెళ్లి పెద్దలు కుదిర్చినదే. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి మే 5 2011లో వివాహం జరిగింది. ఇక ప్రణతి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మేనకోడలి కూతురు. పారిశ్రామిక వేత్త అయిన నార్నె శ్రీనివాసరావుకు కూతురు. ఎన్టీఆర్,ప్రణతి జంటకి ఇద్దరు సంతానం అభయ్ రామ్, భరత్ రామ్. ఇక వీరి వివాహం జరగడం వెనుక పెద్ద కథే ఉంది. ఎన్టీఆర్ మూవీస్ కు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో అలాగే ఫ్యామిలికి కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తాడు.ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, పిల్లల విషయంలో చాలా కేరింగ్ తీసుకుంటాడు. ఆయన చాలాసార్లు ప్రణతి గురించి, పిల్లల గురించి ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. అయితే ప్రణతి పెళ్లికి ముందే ఎన్టీఆర్ కు కండిషన్స్ పెట్టిందట. ఎన్టీఆర్ తో లక్ష్మీ ప్రణతి నిశ్చితార్ధం జరిగిన తరువాత ప్రణతి తన కండిషన్స్ చెప్పిందంట. ఇక పెళ్లి తర్వాత తన కోసం ఎన్టీఆర్ కనీసం రెండు నెలల టైమ్ ని కేటాయించాలని, అలాగే స్నేహితులతో కలిసి బయటికి వెళ్లడం తగ్గించాలని కూడా చెప్పిందంట.అంతేకాకుండా ఎన్టీఆర్ తినే ఆహార విషయంలో కూడా తానే జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పిందంట. ఇక మూవీ షూటింగ్స్ కోసం అవుట్ డోర్ కు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ వేసుకునే డ్రెస్ విషయంలో కూడా తానే చూసుకుంటానని తెలిపిందంట ప్రణతి. ఈ విధంగా పెళ్లికి ముందే ఎన్టీఆర్ కు కండిషన్స్ పెట్టి, ప్రణతి మంచి భార్యగా నిలిచింది. కాగా వీరి చూడముచ్చటగా, అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 6 వరుస సూపర్ హిట్స్ తో మంచి స్వింగ్‌లో ఉన్నాడు. వరుసగా 2 పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నాడు.
Also Read: అడివి శేష్ లాగా డబుల్ హ్యాట్రిక్ కొట్టిన హీరోస్…లిస్ట్ ఓ లుక్ వేయండి.