అడివి శేష్ లాగా డబుల్ హ్యాట్రిక్ కొట్టిన హీరోస్…లిస్ట్ ఓ లుక్ వేయండి.

Ads

సిని పరిశ్రమలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వరుసగా రెండు సినిమాలు హిట్స్ అవ్వడమే చాలా కష్టంగా మారింది. కానీ సిని పరిశ్రమలో కొనసాగాలంటే సినిమాలు విజయం సాధించాలి. వరుసగా హిట్స్ ఇవ్వాలి అనేది అందరికి తెలిసిన విషయమే.

Ads

అయితే వరుసగా సినిమాలు హిట్స్ అవ్వాలంటే సమయం కూడా కలిసి రావాలి. అలాంటిది రెండు మూడు కాదు, ఏకంగా ఆరు సినిమాలు వరుసగా హిట్ అవ్వడం అంటే చిన్న విషయం అయితే కాదు. స్టోరీ ఎంపిక చేసుకున్న దగ్గర నుండి విడుదల వరకు ప్రతీది పర్ఫెక్ట్‌గా ఉంటే తప్ప ఇలాంటి అరుదైన రికార్డ్ సాధ్యమవుతుంది. ఇక ఇలా ఇప్పటి తరంలోనే ముగ్గురు హీరోలు డబుల్ హ్యాట్రిక్ ఇచ్చారు.ఆ హీరోలు ఎవరో కాదు. జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ హీరో అడివి శేష్. ఈ అరుదైన ఫీట్ ఈ ముగ్గురు హీరోలకే సాధ్యమైంది.జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో సిని పరిశ్రమలోకి వచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నారు. ఆ తరువాత దమ్ము సినిమా నుండి రభస వరకు వరుసగా అపాజయాలను చూశారు. ఆ తరువాత పూరీ డైరెక్షన్ లో వచ్చిన ‘టెంపర్’ తో హిట్ అందుకున్నాడు. ఇక అప్పటి నుండి ఇటీవల విడదలైన ఆర్ ఆర్ ఆర్ వరకు వరుసగా రెండు హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఎన్టీఆర్ అనతరం హీరో నాని వరుసగా ఆరు హిట్స్ ని అందుకున్నాడు. పైసా సినిమా నుండి జెండాపై కపిరాజు సినిమా వరుకు వరుస అపజయాలను పొందిన హీరో నాని ఎవడే సుబ్రమణ్యం నుండి విజయాల దారిలో నడుస్తున్నాడు. బ్యాక్ తో బ్యాక్ సినిమాలతో డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు హిట్ అవ్వడంతో నటుడిగానూ నాని రేంజ్‌ మారిపోయింది. భలే భలే మొగాడివోయ్‌ నుండి నిన్ను కోరి వరకు వరుసగా ఆరు హిట్స్ అందుకున్నాడు.ఇక తాజాగా హిట్ 2 సినిమాతో విజయాన్ని పొంది అడివి శేష్ కూడా డబుల్ హ్యాట్రిక్ హిట్స్ లిస్ట్ లో మూడో హీరోగా నిలిచాడు. అడివి శేష్ వరుసగా సూపర్ హిట్స్‌ ఇస్తూ తన సత్తాచాటుతున్నాడు. మొదట్లో వరుస ఫెయిల్యూర్స్ రావడంతో తానే ఓ థ్రిల్లర్ స్టోరీని రాసుకుని, సినిమా తీసి క్షణం సినిమాతో హిట్ కొట్టాడు. అడివి శేష్ ఆ తరువాత అమీ తుమీ, ఎవరు, గూఢచారి, మేజర్, హిట్ 2 లతో దూసుకు వెళ్తున్నాడు.

Also Read: నిర్మాతలుగా మరి భారీగా నష్టపోయిన 10 మంది హీరోయిన్లు ఎవరో తెలుసా?

Previous articleమహేష్ ‘ఒక్కడు’ మూవీలో ధర్మవరపు సుబ్రమణ్యం చెప్పే ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుసా?
Next articleవైరల్ అవుతున్న కొత్త బంగారు లోకం హీరోయిన్ లేటెస్ట్ ఫోటోస్..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.