Ads
భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమం లో ప్రముఖ పాత్రధారి లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహుదూర్ శాస్త్రి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ నాయకుడు కూడా. రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా విద్యావేత్త, ఉద్యమకారుడు ఈయన. శాస్త్రి గారి మరణాంతరం 1966లో భారత రత్న ఇచ్చారు. అయితే లాల్ బహుదూర్ శాస్త్రి మరణం వెనుక కారణం ఎవరికీ తెలియదు. ఇప్పటికి కూడా అది ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. మచ్చలేని ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు లాల్ బహుదూర్ శాస్త్రి.
దేశ అభివృద్ధిని ద్యేయంగా పెట్టుకుని పని చేసిన ప్రధానుల్లో మొదట పేరు లాల్ బహుదూర్ శాస్త్రిదే వినబడుతుంది. విదేశాల్లో చనిపోయారు ఈయన. విదేశాల్లో చనిపోయిన మొదటి భారత ప్రధాని ఈయనే.
ఒప్పంద పత్రాల మీద సైన్ చేసి..
1964 భారత్ -పాక్ మధ్యన యుద్ధం అవుతోంది. భారత్ విజయం చివరి దశ లోనే ఉందప్పుడు. ఐక్యరాజ్యసమితి కాల్పుల విరమణ ఒప్పందానికి ఆహ్వానించడంతో శాస్త్రి గారు తాష్కెంట్ వెళ్లారు. పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తో ఒప్పంద పత్రాల మీద సైన్ చేసారు. తరవాత రోజే ఈయన చనిపోయారు. శరీరం మీద గాట్లు వున్నాయి. అలానే ఆయన దేహమంతా కూడా నీలం రంగు లోకి మారింది. శాస్త్రి గారి భార్య విషప్రయోగం చేశారని ఆరోపించారు. ఈయన మరణంపై నియమించిన రాజ్‌నారాయణ్ కమిటి నివేదిక మాత్రం ఇంకా రాలేదు.
Ads
ఇక లేరు..
ఈయన చనిపోయే ముందు ఈయన కూతురి తో మాట్లాడారు. పాలు తాగి పడుకుంటానని అన్నారు. ఇంతలో ఫోన్ లైన్ డిస్ కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత ఓ పదిహేను నిమిషాలకి లైన్ దొరికింది. సోవియట్‌కు చెందిన ఓ అధికారి ఫోన్ లిఫ్ట్ చేసి.. మీ తండ్రిగారు చనిపోయారన్నాడు.
డాక్టర్ కూడా…
తాష్కంట్ కి శాస్త్రి గారి వెంట అతని వ్యక్తిగత వైద్యుడు RN చుగ్ కూడా వెళ్ళాడు. ఆయన కూడా పక్కన రూమ్ లోనే వున్నాడు. శాస్త్రికి గుండెపోటు వచ్చిందని సోవియట్ అధికారులు ఆయనకి కూడా చెప్పలేదు. చనిపోయాకనే చెప్పారు. 1977లో శాస్త్రి మరణంపై దర్యాప్తుకు నియమించిన కమిటీ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి ఈయ కారు లో ఢిల్లీకి వెళ్తుంటే లారీ వచ్చి ఢీ కొట్టింది. ఆయన చనిపోయారు.
పీఏ కూడా…
శాస్త్రి గారి పీఏ రామ్‌నాధ్ కూడా తాష్కంట్ వెళ్ళాడు. కమిటీ వాంగ్మూలం ఇచ్చేందుకు ఇంటి నుండి ఒక్కడుగు వేసాడు అంతే .. ఒక వాహనం వచ్చి ఢీ కొట్టింది. రెండుకాళ్ళూ పోయాయి. తలకు బలమైన గాయాలు అయ్యాయి. గతాన్ని మర్చిపోయాడు. 1977లో ఈయన మరణం పై దర్యాప్తుకు నియమించిన రాజ్‌నారాయణ్ కమిటి నివేదిక ఇంకా రాలేదు. మిస్టరీగానే ఉండిపోయింది.