వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క ఇంట్లో ఏ దిక్కులో ఉంచాలి ? ఆ ప్రాంతంలో అస్సలు ఉంచకూడా ?

Ads

ఔషధ గుణాలు ఉన్న తులసి మొక్కని ప్రతి ఒక్క హిందువు ఇంట్లో కూడా ఉంచుతారు. హిందువుల ప్రతి రోజు తులసి మొక్కకి పూజ చేస్తారు. తులసి మొక్క పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతిరోజు నీళ్లు పోయడం తులసి మొక్క నిద్రిస్తే మరో మొక్క తెచ్చి వేయడం.. ఎండిపోతే అశుభంగా భావించడం ఇలా ఎన్నో ఉంటాయి. తులసి మొక్కలు లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీబయటిక్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది. జ్వరంతో బాధపడే వాళ్ళని కూడా ఇది త్వరగా రికవరీ చేస్తుంది.

గుండె ఆరోగ్యానికి, ఒత్తిడి, డయాబెటిస్ వంటి సమస్యలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. తులసి మొక్కని లక్ష్మీదేవిగా భావించి ప్రతి ఒక్క ఇళ్లల్లో కూడా పూజలు చేస్తూ ఉంటారు.

Ads

తులసి మొక్క ఏ ఇంట ఉంటే ఆ ఇంట ధనం, ఆరోగ్యము ఉంటుందని నమ్ముతారు. అన్ని దేవుళ్ళకి తులసి మొక్క అంటే ఎంతో ఇష్టం అని అంటారు. ముఖ్యంగా విష్ణుమూర్తికి తులసి అంటే ఎంతో ఇష్టమట. అయితే తులసి మొక్క విషయంలో కొంతమందికి సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలని ఇప్పుడే క్లియర్ చేసుకోండి. ఇంట్లో తులసి మొక్కని పెట్టేటప్పుడు ఏ వైపు పెడితే మంచిదని ఎక్కువమంది అడుగుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా తూర్పు వైపు తులసి మొక్కని పెట్టడం మంచిది.

ఒకవేళ కనుక కుదరకపోతే బాల్కనీ లేదా కిటికీ దగ్గర ఉత్తరం వైపు లేదంటే ఈశాన్య వైపు పెట్టడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి మొక్క దగ్గర శుభ్రం పాటించాలి. తులసి మొక్క దగ్గర చెత్తాచెదారం ఉండకుండా చూసుకోవాలి. చీపురు, చేట, చెత్తబుట్ట వంటివి పెట్టకూడదు. తులసి మొక్కను కింద పెట్టకూడదు. కొంచెం గచ్చుకి ఎత్తుగా కట్టి దాని మీద పెట్టాలి. తులసి మొక్కతో పాటుగా పక్కన ఏ ముళ్ళ మొక్క ఉండకూడదు. తులసి కోటలో కేవలం తులసి మొక్కని మాత్రమే ఉంచాలి.

Previous article40 ఏళ్ళు దాటాయా..? అయితే ఈ ఆహారాన్ని తీసుకోండి..!
Next article”లాల్ బహుదూర్ శాస్త్రి” గారి మ‌ర‌ణం ఇప్ప‌టికీ మిస్ట‌రీనే…!