నితిన్ కి అక్కగా ఒకప్పటి స్టార్ హీరోయిన్…రీఎంట్రీ మాములుగా లేదుగా.!

Ads

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకొని ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ పాపం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి రియంట్రీ ఇచ్చాక అక్క, అత్త,ఆంటీ పాత్రలు చేస్తూ సరిపెట్టుకుంటుంది. ఇది కేవలం ఆ ఒక్క హీరోయిన్ పరిస్థితే కాదు. టాలీవుడ్ లో ఆరు పదులు వయసు దాటుతున్న హీరోలు మాత్రం ఇంకా స్టార్ హీరోలు గానే వెలుగుతున్నారు. మరి అవసరమైతే తండ్రి క్యారెక్టర్ లో ద్విపాత్రాభినయం చేస్తారే తప్ప హీరో క్యారెక్టర్ వేరే వాళ్లకు ఇచ్చే ఛాన్స్ లేదు.

కానీ హీరోయిన్లు మాత్రం కొన్ని సినిమాల తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి పరిమితం కావలసి వస్తుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న స్టార్ నటి మరెవరో కాదు ఒకప్పుడు హీరోయిన్ గా ఉండి ఆ తరువాత సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న లయ. రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్ గా లయకు మంచి గుర్తింపు ఉంది.. వేణు తొట్టింపూడి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన స్వయంవరం చిత్రంలో విజయవాడ అమ్మాయి లయ కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

Ads

ఆ మూవీలో .. సూపర్ హిట్ అయిన పీకాసో చిత్రమా పాట నిజంగా ఆమె కోసమే రాశారా అన్నంత అందంగా ఉంటుంది లయ. అయితే కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడు ఎన్ఆర్ఐ ని పెళ్లి చేసుకొని విదేశాలకు చెక్కేసిన లయ…గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో డాన్స్ వీడియోస్ తో బాగా వైరల్ అయింది. తెలుగుతనం ఉట్టి పడేలా ఎంతో సాంప్రదాయ బద్ధమైన పాత్రలకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూ రావడంతో లయకు అప్పట్లో ఛాన్సులు చాలా తక్కువ అనే చెప్పాలి. ప్రస్తుతం వేణు శ్రీరామ్…నితిన్ కాంబోలో వస్తున్న తమ్ముడు చిత్రంలో లయ హీరో నితిన్ అక్క పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Previous article“వంగవీటి రాధా” పెళ్లి పత్రిక చూసారా.? వైరల్ అవుతున్న ఫోటో.!
Next articleరైల్వే ట్రాక్ పక్కన ఈ అల్యూమినియం బాక్స్ ని ఎప్పుడైనా గమనించారా? అది లేకుంటే మన ప్రాణానికే ప్రమాదమని తెలుసా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.