“వంగవీటి రాధా” పెళ్లి పత్రిక చూసారా.? వైరల్ అవుతున్న ఫోటో.!

Ads

వంగవీటి రాధాకృష్ణ…త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. రాజకీయ నేపథ్యానికి చెందిన వంగవీటి వివాహం చేసుకోబోయే అమ్మాయి కూడా రాజకీయ బ్యాగ్రౌండ్ ఉంది . ఈనెల 22వ తారీఖున వంగవీటి రాధా పెళ్లి నర్సాపురం కు చెందిన పుష్పవల్లి అనే అమ్మాయితో జరగనుంది. ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా ఎందరో ప్రముఖులు హాజరుకానున్న ఈ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

vangaveeti

వంగవీటి రాధాకృష్ణ అక్టోబర్ 22వ తారీకు రాత్రి 7 గంటల 59 నిమిషాలకు.. శ్రవణా నక్షత్ర యుక్త వృషభ లగ్నం నందు ఖరారు చేయబడిన శుభ ముహూర్తానికి పుష్పవల్లి మెడలో మాంగల్యం కడతాడు. అయితే వంగవీటి పెళ్లి అంటే కేవలం రాజకీయ ప్రముఖులే కాదు అభిమాన గణాలు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతారు కాబట్టి దానికి అనుగుణంగా పెళ్లి వేదికను ఖరారు చేశారు. విజయవాడ నిడమానూరు పోరంకి రోడ్డు లోని మురళీ రిసార్ట్స్ ఈ పెళ్ళికి వేదిక కానుంది.

Ads

vangaveeti

ఇంతకీ అమ్మాయి ఎవరో కాదు నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి ..అమ్మాని దంపతుల రెండవ కూతురు. జక్కం అమ్మాని 1987 నుంచి 1992 వరకు టిడిపి తరఫున నరసాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాదులో ఉన్నత విద్యను అభ్యసించిన పుష్పవల్లి కొంతకాలం యోగా టీచర్ గా పని చేసిన తర్వాత ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో కీలకమైన పోస్టులో విధులు నిర్వహిస్తుంది.

vangaveeti

ఇటీవల తిరిగి నరసాపురంలో కొత్త ఇంటిని ఏర్పాటు చేసుకున్న తర్వాత జక్కం వారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వారాహి యాత్రలో భాగంగా నరసాపురం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వీరి ఇంట్లోనే బస చేయడం జరిగింది. వంగవీటి రాధా ఒకపక్క ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతూ మరో పక్క పెళ్లి కొడుకు కాబోతున్నాడు

Previous articleఆమె 12 రోజులు 3 పూటలా అరటిపండు మాత్రమే తినింది…తర్వాత ఏమైందో తెలుసా?
Next articleనితిన్ కి అక్కగా ఒకప్పటి స్టార్ హీరోయిన్…రీఎంట్రీ మాములుగా లేదుగా.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.