Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన నటులు నందమూరి తారక రామారావు గారు. అసలు తెలుగు సినిమా అనే ఒక సినిమా ఉంది అని చాటి చెప్పిన వారిలో తారక రామారావు గారు మొదటి వరుసలో ఉంటారు. ఎన్నో రకమైన పాత్రలను తారక రామారావు గారు తెర మీద పోషించారు.
కొన్ని సినిమాలకి దర్శకత్వం కూడా వహించారు. అసలు ఆయన పోషించని పాత్ర లేదు ఏమో. అని రకాల పాత్రలను ఎంతో సులువుగా చేసేవారు. సినిమాల్లో నటించాక కొంత కాలం తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి దేశ ప్రజలకు సేవ చేశారు తారక రామారావు గారు. తారక రామారావు గారి చేతిరాత చాలా బాగుంటుంది అని అంటూ ఉంటారు.
అక్షరాలు ముత్యాల లాగానే ఉంటాయి అని అంటారు. తారక రామారావు గారు ప్రముఖ నటులు, రాజకీయవేత్త అయిన కొంగర జగ్గయ్య గారికి రాసిన ఉత్తరం ఒకటి ఇప్పుడు బయటికి వచ్చింది. ఈ ఉత్తరం రాసిన సమయానికి తారక రామారావు గారికి 24 సంవత్సరాలు ఉన్నట్టు సమాచారం. ఈ ఉత్తరం ఇంగ్లీష్ లో ఉంది. ఇందులో రామారావు గారు ఏం రాశారంటే.
“నేషనల్ ఆర్ట్స్ థియేటర్, బెజవాడ
తేదీ: 10-10-47
Ads
ప్రియమైన Mr.జగ్గయ్య,
మీ నుండి నాకు ఎటువంటి ఉత్తరాలు రావట్లేదు. మీ గురించి నేను అందరిని అడుగుతున్నాను కానీ నాకు సరైన సమాచారం అందట్లేదు. మీరు ఎడిటర్ గా, ట్యూటర్ గా ఇంకా ఎన్నో పోస్ట్ లలో నియమించబడ్డారు అని విన్నాను. నేను ఇప్పుడు సబ్ కోర్ట్ లో పనిచేస్తున్నాను. మనం స్టూడెంట్ గా ఉన్నప్పుడు కన్న కలలు అన్నీ కూడా మారిపోయాయి. ఇప్పుడు నేను నా మనసుని, నా కళని అమ్ముకొని ఈ ఆఫీసులో పని చేస్తున్నాను. మన భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అంతే కాకుండా మీతో కొంచెం సేపు మాట్లాడి నా మెదడుని రిఫ్రెష్ చేసుకోవాలి అని ఉంది. నాటకాల్లో మనం భవిష్యత్తులో ఏం చేద్దాం అనే విషయం గురించి చర్చించుకుందాం. ఈ మీరు లెటర్ రాయండి. నేను ఆ తేదీ వచ్చిన రోజు ఎదురు చూస్తూ ఉంటాను.
మీకు నా శుభాకాంక్షలు
మీ
రామారావు బి.ఎ”
అని ఉత్తరంలో రామారావు గారు రాశారు. ఈ లెటర్ చూస్తూ ఉంటే ఇది సినిమాల్లోకి రాకముందు రాసిన లెటర్ అని అర్థం అవుతోంది. అంతే కాకుండా తనకి కళల పట్ల ఎంత ఆసక్తి ఉంది అనేది కూడా ఈ లెటర్ చూస్తూ ఉంటే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత సినిమాల్లోకి రావడం, రామారావు గారు, జగ్గయ్య గారు మంచి నటులు అవ్వడం ఇదంతా జరిగింది. కానీ రాకముందు వాళ్ళు తమ కళని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే విషయం గురించి ఇంత ఆలోచించేవారు.
ALSO READ : హనుమాన్ సినిమాలో హీరోయిన్‌లో ఇది VFX చేసారా..? దీని అవసరం ఏం ఉంది..?