రూ.2000, 500, 100 నోట్ల మీద నల్లటి గీతలు ఉంటాయి..? డిజైన్ అయితే కాదు..!

Ads

డబ్బు లేకపోతే ఏదీ లేదు. ప్రతిదీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. ఏమైనా కొనుగోలు చేయాలన్నా లేదంటే ఎటువంటి ఫీజులు కట్టాలన్నా, వైద్యం కోసం అయినా సరే మనం కచ్చితంగా డబ్బు చెల్లించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశం లో కరెన్సీ నోట్లని ప్రింట్ చేస్తూ ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే దేశ కరెన్సీ లో చాలా రకాల నోట్లు ఉంటాయి.

అలానే మన దేశ కరెన్సీ నోట్ల లో ప్రతి నోటికి కూడా కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి వీటి వలన ఏమవుతుంది అంటే మనం నకిలీ నోటు ఏది..? ఏది నిజమైన నోటు అనేది గుర్తించొచ్చు.

నకిలీ నోట్ల వల్ల చాలా మంది మోసపోతూ ఉంటారు నకిలీ నోట్లని ప్రింట్ చేసి ప్రజల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం చిన్న చిన్న గుర్తులు ని గమనిస్తే నకిలీ నోట్లని సులభంగా కనిపెట్టొచ్చు. ప్రధాన నరేంద్ర మోడీ నోట్లోని 2016లో నోట్లని రద్దు చేశారు అప్పుడు కరెన్సీ నోట్లకి సంబంధించి ప్రింటింగ్ విషయంలో కొన్ని కీలక మార్పులు చేయడం జరిగింది. వంద రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లపై నల్లగా గీతలు ఉంటాయి.

Ads

నకిలీ నోట్ల మీద ఇలా వుండవు. ఇక మరి ఎందుకు ఈ గీతాలు ఉంటాయి..? వీటి వలన ఉపయోగం ఏమిటి అనేది చూద్దాం. ఎందుకు వంద రూపాయల నోట్ల మీద.. 500 రూపాయలు నోట్ల మీద.. 2000 రూపాయల నోట్ల మీద నల్లని గీతాలు ఉంటాయి అంటే… మనకి కళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా నోట్లని చూసి తెలుసుకోవచ్చు కానీ అంధులు కరెన్సీ నోట్లనే గుర్తించలేరు.

అందుకని వాళ్ళకి ఈజీగా ఉండాలని కరెన్సీ నోట్ల మీద నల్లని గీతాలు ముద్రించారు. అందుకే కరెన్సీ నోట్ల మీద ఈ విధంగా ఉంటుంది. 100 రూపాయల నోటు మీద (|| ||), 200 రూపాయల నోటు మీద (|| o o ||), 500 రూపాయల నోటు మీద 5 గీతలు (|| | ||), 2,000 రూపాయల నోటుపై 7 గీతలు (| || | || |) ఉంటాయి. ఈ గీతలని వాళ్ళు తాకి ఈజీగా కరెన్సీ నోట్లని గుర్తించొచ్చు.

Previous articleవేదం మూవీలో ‘కర్పూరం’ క్యారెక్టర్ చేసింది ఎవ‌రో తెలుసా?
Next articleత్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడిగా మారకముందు ఏం చేసేవారో తెలుసా..!