2022 లో పాజిటివ్ టాక్ వచ్చినా కూడా విజయం పొందని 10 సినిమాలు..

Ads

2022 సినీ ఇండస్ట్రీకి ప్రత్యేకమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ఎందువల్ల అంటే ఫిలిం మేకర్స్ కు 2022 ఎన్నో పాఠాలను నేర్పింది. సూపర్ హిట్ అవుతాయి అని భావించిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పరాజయం పొందాయి. అయితే కొన్ని సినిమాలు హీరో ఇమేజ్ లేకున్నా సూపర్ హిట్ అయ్యాయి.

Ads

ఇలాంటి వాటిని ఎవరు చూస్తార్లే అని భావించిన చిత్రాలు అధ్బుతమైన విజయాన్ని అందుకున్నాయి. చెప్పాలంటే ఏ మూవీ ప్రమోషనల్ కంటెంట్ ఆడియెన్స్ ను ఆకట్టుకుందో ఆ మూవీనే విజయం సాధించింది. ఒకప్పుడు అయితే క్రిటిక్స్ టాక్, మౌత్ టాక్ బాగుంటే సినిమా ఆడేది.ఇప్పుడు అవి రెండు బాగున్నా కూడా సినిమాలు హిట్ అవ్వలేదు. దానికి ఉదాహరణగా కొన్ని సినిమాలు ఉన్నాయి.అలా 2022 లో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి హిట్ కానీ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..1) అంటే సుందరానికి :
నాని,నజ్రియా ఫహాద్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన తొలి రోజు హిట్ టాక్ వచ్చింది. ప్లాప్ గా నిలిచింది. 2) భీమ్లా నాయక్ :
పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో వచ్చిన సినిమా భీమ్లా నాయక్. తొలి రోజు ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ రావడంతో భారీ వసూళ్లు రాబడుతుందని అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద జోరు చూపించింది లేదు. చివరగా ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.
3) విరాట పర్వం :
రానా, సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకి విడుదల అయిన రోజున మంచి టాక్ వచ్చింది. కానీ డిజాస్టర్ గా మిగిలింది.
4) అశోకవనంలో అర్జున కళ్యాణం :
హీరో విశ్వక్ సేన్ నటించిన ఈ సినిమాకి ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తో మొదలైంది. కానీ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేక ప్లాప్ గా మిగిలింది.
5) సమ్మతమే :
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి నటించిన ఈ సినిమా విడుదల అయిన రోజున మంచి టాక్ వచ్చింది కానీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.
6) గాడ్ ఫాదర్ :
మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా  ‘లూసిఫర్’ కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తొలి రోజు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బ్రేక్ ఈవెన్ చేయలేక నష్టాలను మిగిల్చడంతో డిజాస్టర్ గా నిలిచింది.
7) ఓరి దేవుడా :
ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా, కీలకమైన పాత్రలో హీరో వెంకటేష్ నటించారు. తొలి రోజు సూపర్ హిట్ టాక్ వచ్చింది.  కానీ అబౌవ్ యావరేజ్ గా నిలిచింది.
8) స్వాతి ముత్యం :
ఈ సినిమా చిన్న మూవీగా రిలీజ్ అయినా కూడా తొలిరోజు హిట్ టాక్ ను తెచ్చుకుంది. ప్లాప్ గా  నిలిచింది.
9) ఊర్వశివో రాక్షశివో :
ఈ సినిమాలో అల్లు శిరీష్ హీరోగా నటించాడు.  మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చినా, కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం పొందలేకపోయింది.
10) 18 పేజెస్ :
ఇటీవలే విడుదల అయిన ఈ సినిమాలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు.  ఈ సినిమా రిలీజ్ అయిన రోజున హిట్ టాక్ ను తెచ్చుకుంది. అయితే బ్రేక్ ఈవెన్ అవడం కోసం చాలా కష్టపడుతోంది.
Also Read: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సీరియల్ గురించి తెలుసా?

Previous articleమెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సెన్సార్ టాక్.. మెగా మాస్ జాతర..!
Next articleవైరల్ అవుతున్న స్టార్ హీరో అజిత్ కూతురి ఫోటోలు..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.