యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సీరియల్ గురించి తెలుసా?

Ads

తెలుగులో స్టార్ హీరో అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయల్సిన అవసరం లేదు. ఆయన హీరోగా నటించిన చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఎన్టీఆర్ నటనతో, డాన్స్, డైలాగ్స్ తో తనదైన మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు.

Ads

తన తాత అయిన సీనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చారు. బాల రామాయణం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి, రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నాడు. ఆ తరువాత వరుస  విజయాలు అందుకుంటూ ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా ఎదిగారు. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా జూనియర్ ఎన్టీఆర్ కొనసాగుతున్నాడు. అయితే ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక సీరియల్ లో నటించాడు. అయితే ఆ విషయం ఎక్కువ మందికి తెలియదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఆ సీరియల్ ఏమిటో చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో హీరోగా నటించక ముందు భక్త మార్కండేయ అనే సీరియల్ నటించాడు. అయితే భక్త మార్కండేయ సీరియల్ గురించి కానీ, ఆ సీరియల్ లో ఎన్టీఆర్ నటించాడని కానీ, చాలా మందికి తెలియదు. ఈటీవీ ఛానెల్ ప్రారంభించిన మొదట్లో ఈ సీరియల్ వచ్చింది. ఎన్టీఆర్ ఈ సీరియల్ లో మార్కండేయునిగా నటించాడు. శివ భక్తుడిగా నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు.హీరో అయిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షో తో బుల్లితెర ఆడియెన్స్ ని అలరించాడు. తనదైన స్టైల్లో ఎన్టీఆర్ అలరించాడు. ఆ తరువాత ఎవరు మీలో కోటీశ్వరుడులో సందడి చేశారు. అయితే సీరియల్లో జూనియర్ ఎన్టీఆర్ భక్త మార్కండేయ గెటప్ లో ఉన్న ఫోటోలు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇటు వెండి తెరపై, అటు బుల్లితెర పై కూడా ఆడియెన్స్ అలరిస్తూ దూసుకుపోతున్నాడు.

Also Read: ఎన్టీ రామరావుగారి ఆహారపు అల‌వాట్ల గురించి తెలుసా?

Previous articleసిల్క్ స్మిత మరణానికి ముందు రాసిన చివరి ఉత్తరంలో ఏముందో తెలుసా?
Next articleమొదటి సినిమానే త‌మ ఇంటి పేరుగా మార్చుకున్న 11 మంది నటినటులు వీరే..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.