Ads
బోయపాటి శ్రీను రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీస్ స్కంద. నార్మల్ గా బోయపాటి శీను సినిమాలంటే ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలుసు. అవతల విలన్ ఫిజిక్ కు.. చూసే వాళ్ళ లాజిక్ కు…హీరో సైజుకి ఎక్కడ సంబంధంలేని ఫైట్లు బోయపాటి స్టైల్. న్యూటన్ తన గ్రావిటీ సూత్రాలు పక్కన పెట్టాల్సిందే కానీ.. బోయపాటి మాత్రం తన లాజిక్స్ ను పక్కన పెట్టడు. ఫిజిక్స్ కు సంబంధించిన అన్ని సూత్రాలు బోయపాటి మ్యాజిక్ ముందు చెత్తబుట్టలో వెళ్లి పడాల్సిందే. మరి అలా ఉంటుంది బోయపాటి అంటే..
బైక్ రౌండ్ తిరిగింది అంటే అర్థం కాని బోయపాటి ట్రాక్టర్ ని కూడా రౌండ్లు తిప్పుతాడు… దుక్కి దున్నే పనిముట్లు హీరో పోలీసులు పొడిచి చంపడం…. కత్తిని గాలి కంటే వేగంగా తిప్పడం…ఇలాంటివి ఎన్నో బోయపాటి క్రియేటివిటీకి నిదర్శనాలు. షార్ట్ కట్ గా వీటిని ట్రైలర్ లో చూస్తే గూస్ బంప్స్ క్రియేట్ అవుతాయి.. వెళ్లాలంటే మాత్రం ఒకరకంగా ప్రిపేర్ అయ్యే వెళ్లాల్సిందే. లాజిక్ లేని మ్యాజిక్ తో.. అసలు ఇది ఎలా జరిగింది అన్న ఆలోచన కూడా రాకుండా చూస్తే మాత్రం బోయపాటి ఓ రేంజ్ లో మైండ్ బ్లాక్ చేస్తాయి.
Ads
మరీ ముఖ్యంగా ఈ స్కంద మూవీ లో అయితే.. విలన్లను ఏకంగా ముఖ్యమంత్రులుగానే చూపించాడు. పోనీ వాళ్ళను అట్ల వదిలాడా అంటే…హీరో వాళ్ళని ఫుట్బాల్ లాగా ఆడుకున్నాడు. ఒక పల్లెటూరికి చెందిన అతి సామాన్యమైన కుర్రాడు…. సెక్యూరిటీని దాటి సీఎం ఇంటిలోకి ప్రవేశించి…సీఎంనే భయపడతాడు. అంత రేంజ్ లో ఉన్న సీఎం నీకేం కావాలో తీసుకుపో అంటే…పచారీ కొట్టుకెళ్లి సామాను తెచ్చినంత సింపుల్ గా ఇద్దరు సీఎం కూతుర్లను కిడ్నాప్ చేసి తీసుకొస్తాడు.
ఇది కేవలం శాంపిల్ మాత్రమే.. ఇలాంటి విడ్డూరాలు స్కందాలో కావలసినవి ఉన్నాయి. మరి ముఖ్యంగా స్టార్టింగ్ సీన్లో గవర్నర్ వచ్చి ఒక సీఎంను ఇంకో సీఎం కి పరిచయం చేస్తాడు. పక్క రాష్ట్రం సీఎం ఎవరు కూడా తెలియదా? అని మాత్రం అనుకోకండి ..అలాంటి లాజిక్స్ బోయపాటి సినిమాల్లో ఉండవు. మరి ఒక ఫైటింగ్ సీన్ లో అయితే తన టోర్న్ జీన్స్ ప్యాంట్ లో నుంచి హీరో కత్తిని తీస్తాడు. అది కూడా కూరలు కోసే కత్తి కాదు…అసలు అంత కత్తి అక్కడ ఎలా పట్టిందా అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. తెలిసి తీస్తాడో..తెలియక తీస్తాడో ..మనకైతే తెలియదు కానీ …ప్రస్తుతం బోయపాటి లాజిక్స్ పై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతుంది.