వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఏకంగా 7 మంది బిగ్ బాస్ లోకి…వైరల్ అవుతున్న లిస్ట్ లో ఆ హీరోయిన్ పేరు కూడా.?

Ads

ప్రస్తుతం తెలుగులో అతి పెద్ద రియాలిటీ షో ఏది అంటే…బిగ్ బాస్ అని అనవచ్చు. తెలుగింటి మంచి ఆదరణ అందుకుంటున్న ఈ షో ప్రస్తుతం ఏడవ సీజన్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎంటర్ అయిన 14 మంది కంటెస్టెంట్స్ లో అప్పుడే ఒకరు ఎలిమినేట్ అయిపోవడం కూడా జరిగింది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో ఎంతో రసవత్తరంగా సాగుతుంది ఈ షో.

14 మంది కంటెస్టెంట్లలో పవర్‌ అస్త్రాన్ని గెలిచిన వారే హౌజ్‌మేట్స్ అవుతారంటూ పిటింగ్ పెట్టాడు బిగ్ బాస్. ఇప్పటివరకు శివాజీ, అమర్‌దీప్‌ మాత్రమే హౌజ్‌మేట్స్ అయ్యారు. 14 మందిలో షాకేల, కిరణ్ రాథోడ్, దామిని ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కేవలం 11 మంది మాత్రమే గేమ్‌ ఆడుతున్నారు. ఈ వారం కూడా ఒకరు ఎలిమినేట్ అవ్వనున్నారు. అంటే అప్పుడు మిగిలేది 10 మందే…

Ads

ఇది ఇలా ఉండగా…ఎప్పటిలాగే ఈ సారి కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుంది అంటూ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సారి ఏకంగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 7 మంది హౌస్ లోకి ఎంటర్ అవ్వనున్నారు అనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఆ 7 మంది లిస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అందులో ఎవరెవరు ఉన్నారంటే..సీరియల్‌ ఆర్టిస్ట్‌ అంబటి అర్జున్‌, జబర్దస్త్ నరేష్, సీరియల్ ఆక్టర్ పూజా మూర్తి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ భోలే షావలి,హీరోయిన్‌ ఫర్జానా, సుప్రిత, యూట్యూబర్ కాస్కో నిఖిల్.

Previous articleభారత మహిళ పవర్ అంటే ఇది…పాక్ అధ్యక్షుడికి చుక్కలు చూపించిన ఈమె ఎవరో తెలుసా.?
Next article“స్కంద” లో ఆ రెండు సీన్లపై ట్రోల్ల్స్…ఇదెక్కడి లాజిక్ అండి బోయపాటి గారు.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.