Ads
ప్రేమ కథ అంటేనే జనరల్ గా హ్యాపీ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం…కానీ కొన్ని చిత్రాల్లో మాత్రం కథ ఎప్పటికీ సుఖాంతం కాదు. డైరెక్టర్ ఎంతో రియలిస్టిక్ గా తీసిన ఈ చిత్రాలు నిజంగానే ప్రేక్షకుల హృదయాలను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇలా రియాలిటీ గా ఉండే ప్రేమ కథ చిత్రాలను తీసి మనల్ని థియేటర్లోనే కన్నీళ్లు పెట్టించిన డైరెక్టర్స్ ఉన్నారు. ఇలా ప్రేక్షకులను సినిమా హాల్లో ఏడిపించిన రా సాలిడ్ ప్రేమ కథలు ఏవో తెలుసుకుందామా…
అభినందన
ప్రజెంట్ జనరేషన్ కి ఈ మూవీ గురించి పెద్దగా తెలియకపోవచ్చు…కానీ ఒక్క జనరేషన్ వెనక వాళ్ళకి ఈ మూవీలో పాటలు ఎక్కడన్నా వింటే ఎంతో ఫీలవుతారు. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కి నైన్టీస్ లో ఫేమస్ అయిన చిత్రం ఏదన్నా ఉంది అంటే అభినందన అని టక్కున చెబుతారు.
సుస్వాగతం
ప్రేమించాము…అని అమ్మాయి వెనుక పడుతూ ఇంట్లో వాళ్ళని నెగ్లెట్ చేసే ప్రతి అబ్బాయికి సుస్వాగతం సినిమా ఒక గుణపాఠం లాంటిది. నాలుగు రోజులు పరిచయమైన అమ్మాయిని వెతకడం కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తే చివరి చూపు కూడా దక్కదు అనే ఒక రియల్ లైఫ్ కాన్సెప్ట్ ని ఎంతో అందంగా తెరకెక్కించిన చిత్రం సుస్వాగతం.
7/G బృందావన్ కాలనీ
Ads
సినిమా పేరు మాత్రం బృందావన్ కాలనీ కంటెంట్ మాత్రం భయంకరమైన విషాదంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఇందులో హీరోయిన్ చనిపోయిన తర్వాత జరిగే సీక్వెన్స్ సీన్స్…థియేటర్లోని ప్రేక్షకులను గుండె పగిలేలా ఏడిపించాయి. ఇప్పటికీ ఈ మూవీ గుర్తుకు వస్తే కొందరి మనసులు బరువెక్కుతాయి మరి…కొంతమంది ఇలాంటివి తీయడం అవసరమా అనుకుంటారు కానీ 90 శాతం వరకు నిజజీవితంలో ప్రేమ కథలు ఇలాగే కదా ఎండ్ అవుతాయి.
ప్రేమిస్తే..
ఈ మూవీ ఎండింగ్ అయితే టోటల్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అమ్మాయిని ప్రేమించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేత దెబ్బలు తిని చివరికి పిచ్చివాడిగా మారిపోయిన ఆ లవర్ ని అమ్మాయి హస్బెండ్ ఏ సినిమా ఎండింగ్లో చేర తీయడం అనే కాన్సెప్ట్ అసలు ఎవరి ఊహకి అందదు.
ఓయ్!
ఇది ఒక అందమైన.. హృదయానికి హత్తుకునేటటువంటి మూవీ అని చెప్పవచ్చు. ఒంటరిగా అనాధగా బతికే అమ్మాయి జీవితంలోకి వచ్చిన అబ్బాయి.. ఇద్దరు ప్రేమించుకునే సమయానికి బయటపడిన అమ్మాయి అనారోగ్య పరిస్థితి… చివరికి ప్రేమించిన అమ్మాయి చనిపోయిన ఆమె కోసం అలాగే మిగిలిపోయే అబ్బాయి.. నిజంగా ఇది ఒక కల్ట్ ఫిలిం అని చెప్పవచ్చు.
బేబీ
ప్రజెంట్ జనరేషన్ పిల్లలకు అర్థమయ్యేలా.. అనవసరంగా అమ్మాయిలు ఎలా తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు అనే విషయాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు బేబీ మూవీ లో. ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ బాధ అనుభవించిన ప్రతి ఒక్కరికి ఈ చిత్రం హృదయాన్ని తట్టి… కన్నీరు తెప్పించక మానదు.