Ads
సినీ సెలెబ్రెటీస్ కి అభిమానులు ఏ రేంజ్ లో ఉంటారో అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా స్టార్ హీరోల అభిమానులు ,తమ అభిమానం నటుడు చేసిన చిన్న పనిని కూడా తెగ వైరల్ చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాలేజీ రోజుల్లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ చేత్తో రాసినటువంటి ఒక వ్యాసం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఇంతకీ ఆ వ్యాసంలో ఏముందంటే…”నాకు గుర్తున్నంతవరకు నా చిన్నతనం ఎంతో సంతోషంగా గడిచింది. మా అక్క పుట్టిన ఐదు సంవత్సరాలకు నేను పుట్టాను. నేను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడే క్లాస్ లోని అమ్మాయిలను ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకునేవాడిని.. ఇక నాకంటే పెద్ద అయినా అక్కలు వెళుతుంటే ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం..చక్కే పే చక్కా ట్యూన్‌కి డ్యాన్స్ చేయడం…” ఇలా సాగినా లేక సారాంశం చూసిన ఫాన్స్ అందరు షారుక్ చిన్నప్పటినుంచి ఎంతో రొమాంటిక్ అని కామెంట్స్ పెడుతున్నారు.
Ads
ఇంకొంతమంది షారుఖ్ హ్యాండ్ రైటింగ్ ఎంతో బాగుందని…అతను చిన్నప్పటి నుంచి ఇంత చిలిపి వాడు కాబట్టే సినిమాలలో రాజ్ లేక రాహుల్ పాత్ర పోషించాల్సి వచ్చినప్పుడు ఎంతో సహజంగా చేయగలిగాడని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం షారుక్ నటిస్తున్న జవాన్ చిత్రం సెప్టెంబర్ 7న విడుదల కానుంది. మొట్టమొదటిసారి ఈ షారుఖ్ ఖాన్ బాల్ హెడ్ తో కనిపించే ట్రైన్ సీన్.. ట్రైలర్ లోనే అందర్నీ ఆకట్టుకుంది.
SRK Archives:
An essay that Shah Rukh had written in his younger days. pic.twitter.com/ruf2vhOuEL
— ع (@_IlyaQairyna_) December 4, 2021