Ads
ప్రస్తుతం మార్కెట్లో కంటెంట్ బాగుంటే చాలు సినిమా చిన్నదా పెద్దదా చేసింది స్టార్ హీరోనా, కుర్ర హీరోనా లేక కొత్త హీరోనా కూడా పట్టించుకోవడం మానేశారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో చిన్న తరహా చిత్రాలు కూడా పెద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. ఇదే తరహాలో ఈ రోజు విడుదలైన చిత్రం మ్యాడ్. పైగా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో జాతి రత్నాలకు మించి నవ్వు తెప్పించకపోతే డబ్బులు వెనక్కిస్తాను అని మూవీ నిర్మాత నాగవంశీ అనడం ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ని నెలకొల్పింది. ఈ నేపథ్యంలో ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఓ లుక్ వేద్దాం పదండి…
- మూవీ: మ్యాడ్
- నటీ నటులు: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్, నితిన్,శ్రీగౌరి ప్రియా రెడ్డి, ఆనంతిక,గోపిక
- ఉదయన్.
- డైరక్టర్: కళ్యాణ్ శంకర్
- ప్రొడ్యూసర్స్: హారిక సూర్యదేవర – సాయి సౌజన్య
- సంగీతం: భీమ్స్ సిసిరోలియో
- విడుదల తేదీ: 6-10-2023
స్టోరీ:
మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్),దామోదర్ (సంగీత్ శోభన్) అని ముగ్గురు రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో జూనియర్ విద్యార్థులు. తమ కాలేజీలో ఉన్న భగవాన్ క్యాంటీన్ విషయంలో జరిగిన బాస్కెట్ బాల్ మ్యాచ్ విక్టరీ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ గా మారుతారు. ఆ తర్వాత మనోజ్ శృతిని ప్రేమిస్తాడు.. అశోక్ జెన్నీ ని లవ్ చేస్తాడు. ఇక మిగిలిన దామోదర్ మాత్రం గురువు పేరు తెలియని వెన్నెల అనే అమ్మాయిని లెటర్ రాసింది అని లవ్ చేస్తాడు.
Ads
ఇంజనీరింగ్ చదివిన నాలుగు సంవత్సరాలు ఆ అమ్మాయి మొఖం కూడా చూడకుండా కేవలం ఫోన్లో మాట్లాడుతూ కాలం గడుపుతాడు. తీరా అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అని నాలుగు సంవత్సరాల తర్వాత అతను చేసిన ప్రయత్నంలో అతను ఎదుర్కొన్న సమస్యలేంటి? ఇంతకీ వెన్నెల ఎవరు? లాస్ట్ కి దామోదర్ ప్రేమ ఏ తీరానికి చేరుకుంది? ఈ మొత్తం కథలో లడ్డు అనే వ్యక్తి పాత్ర ఏంటి? తెలుసుకోవాలి ఆలస్యం చేయకుండా సినిమా చూసేయండి.
విశ్లేషణ:
ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఎన్నో చిత్రాలు సక్సెస్ అందుకున్నాయి కానీ వాటిల్లో కొన్ని విఫలమయ్యాయి కూడా. అయితే ఈ మూవీ రావడానికి ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయిస్తుంది. అంతేకాదు ప్రతి మనిషి మనసులో ఎక్కడో అడుగున పడిపోయినా కాలేజీ జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఫస్ట్ అఫ్ కాస్త సాగదీతగా అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ మొదలయ్యాక అసలు కథ వేరే లెవెల్ లో ఉంటుంది. వరుసగా వచ్చే కామెడీ సీన్స్ తట్టుకోలేక థియేటర్ మొత్తం నవ్వులతో నిండిపోతుంది.
మూవీలో సాంకేతిక విలువల విషయంలో ఎక్కడా ఎటువంటి లోపం లేదు. ప్రతి ఒక్క అంశంలో ఎంతో జాగ్రత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. మొత్తానికి కడుపు చెక్కలయ్యేలా నవ్వించే ఒక ఫీల్ గుడ్ మూవీ మ్యాడ్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ మూవీని కాలేజ్ పిల్లలే కాదు…. ప్రతి ఒక్క వయసు వారు ఆస్వాదిస్తారు.
రేటింగ్: 3 / 5
టాగ్ లైన్:
మంచిగా ఫ్రెండ్స్ తో కలిసి పాత రోజులను గుర్తు చేసుకుంటూ సినిమా చూడాలి అనుకునే వాళ్ళకి, మంచి యూత్ మూవీ కావాలి అనుకునే కాలేజ్ స్టూడెంట్స్ కి, కామెడీ మూవీ చూడాలి అనుకునే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇలా అందరికీ నచ్చే చిత్రం మ్యాడ్.