నా భార్య రెండో పెళ్లి చేసుకుంది అని కేసు వేసాడు…చివరికి కోర్టు అతనికే షాక్ ఇచ్చింది..!

Ads

మగవాళ్ళు ఇంట్లో తెలియకుండా బయట రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్న మహనీయులు మన మధ్య ఎందరో ఉన్నారు. అయితే తనకు విడాకులు ఇవ్వకుండానే భార్య మరొక పెళ్లి చేసుకుంది అంటూ కోర్టుకెక్కిన భర్తను మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. అయితే ఆ సదరు భర్తకి అలహాబాద్ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.

ఇంతకీ కేసు పెట్టింది గుజరాత్ కు చెందిన సత్యం సింగ్ అనే వ్యక్తి. అతనికి స్మృతి సింగ్ తో 2017 లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొంతకాలం అత్తింటి ఆగడాలు భరించిన స్మృతి.. అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడు అని పోలీసులకు ఫిర్యాదు చేసి అత్తింటి నుంచి వెళ్ళిపోయింది. ఈ కేసు విచారణ ఇంకా పూర్తికాకముందే తన భార్య మరో పెళ్లి చేసుకుంది అని సత్యం సింగ్ పోలీసులను ఆశ్రయించాడు.

Ads

ఇదే విషయంపై మీర్జాపూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో .. విచారణ జరిపిన కోర్టు సత్యం పిటిషన్ చల్లదంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు సత్యం స్ఫూర్తిల మధ్య జరిగిన వివాహం చట్టపరంగా చెల్లదు కాబట్టి స్మృతి విడాకులు తీసుకోకుండా వేరే పెళ్లి చేసుకుంది అని నిందించే ఆస్కారం లేదు అని తేల్చి చెప్పింది.

వివరాల్లోకి వెళ్తే హిందూ వివాహాల్లో సప్తపదికి ఎంతో విశేష ప్రాముఖ్యం ఉంది. ఆ తంతు జరగకుండా వివాహానికి పరిపూర్ణత రాదు. కాబట్టి ఈ కేసులో విడాకులు తీసుకునే లేదు అనే ప్రశ్న ఉత్పన్నమయ్యే ఛాన్సే లేదు అంటూ పాపం ఆ భర్త పిటిషన్ తోసేసింది అలహాబాద్ హైకోర్టు. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సెక్షన్ 7 ప్రకారం.. వధూవరులు ఇద్దరు హిందూ ఆచార వ్యవహారాలను పాటిస్తూ వివాహ తంతును పూర్తి చేసినప్పుడే ఆ జంటను భార్యాభర్తలుగా కోర్టు పరిగణిస్తుందట. వివాహ తంతులో అత్యంత ముఖ్యమైన సప్తపది లేకుండా జరిగిన పెళ్లి చల్లదని కోర్టు వివరించి చెప్పింది.

Previous articleSIDDHARTH CHINNA REVIEW : “చిన్నా” సినిమాతో “సిద్ధార్థ్” తెలుగులో కంబ్యాక్ ఇవ్వగలిగారా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Next articleMAD REVIEW: కామెడీతో పిచ్చెక్కించే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ “మ్యాడ్”… స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.