Ads
సినీ ఇండస్ట్రీలో దాదాపు అందరి హీరోల పై ఎంతో కొంత నెగెటివిటీ ఉంటుంది. అయితే టాలీవుడ్ లో నెగెటివిటీ లేని హీరో ఎవరు అంటే అందరికీ గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. సెలెంట్ గా తన పనేమిటో తాను చేసుకుపోయే మహేష్ లో అందరికీ పాజిటివిటీనే కనిపిస్తుంది.
అలాంటి మహేష్ బాబుకు ఒక స్టార్ హీరోయిన్ ఆగ్రహం తెప్పించిందనే వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. సైలెంట్ గా తన పని చూసుకునే మహేష్ కు కోపం తెప్పించిన ఆ హీరోయిన్ ఎవరో, ఇప్పుడు చూద్దాం..
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ తో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ఎదురుచూస్తుంటారు. కొందరు ఆ విషయన్ని ఓపెన్ గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సినిమా షూటింగ్ లేదంటే ఫ్యామిలీతో గడపడుతుంటారు. ఎలాంటి వివాదాలకు చోటివ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళే మహేష్ కి లేడి సూపర్ స్టార్ నయనతార కోపం తెప్పించిందని టాక్.
మహేష్ బాబు, నయనతార కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే వీరిద్దరి కాంబోలో సినిమా తీయడానికి కొందరు డైరెక్టర్లు ప్రయత్నించారట. అయితే నయనతార ఒకటి కాదు మూడు సినిమాల్లో మహేష్ తో చేసే ఛాన్స్ ను మిస్ చేసుకుందంట. అయితే ఆ 3 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఆ చిత్రాల కోసం ఆమెని సంప్రదించగా నయనతార కొన్ని కండిషన్స్ పెట్టిందట. వాటికి ప్రొడ్యూసర్ తో పాటుగా హీరో కూడా షాక్ అయ్యారట.
ఆమె పెట్టిన కండీషన్స్ తో నయనతారకు బదులు వేరే హీరోయిన్‌ను తీసుకున్నారట. మహేష్ బాబు ఎప్పుడైనా, ఏదైనా వేడుకలో నయనతార ఎదురైనా కూడా ఆమెను పలకరించలేదట. మహేష్, నయనతార ఎందుకు మాట్లాడుకోరో అనే విషయం ఎవరికీ తెలియదు. ఇదిలా ఉంటే, మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
Ads
Also Read: త్వరలో పెళ్లి చేసుకొనున్న కృష్ణ ముకుంద మురారీ హీరోయిన్.. కాబోయే భర్తను పరిచయం చేసిన కృష్ణమ్మ..!