Ads
సంక్రాంతి సందడి మొదలైంది మరో కొద్దిగంటలలో సినిమా పందాలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇప్పటికే హనుమాన్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నిజానికి ఈ సంవత్సరం పండగకి పెద్ద సినిమాలు చాలానే రిలీజ్ అవుతున్నాయి కానీ గట్టి పోటీ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం, హనుమాన్ కి మాత్రమే. హనుమాన్ ఆల్రెడీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక గుంటూరు కారం రిజల్ట్స్ కొన్ని గంటలలో వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునేది మహేష్ బాబు సంక్రాంతి రోజు ఎన్ని సినిమాలు రిలీజ్ చేశాడు అందులో ఎన్ని హిట్ అయ్యాయి అనేది చూద్దాం.
సినీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిసారి సంక్రాంతి బరిలోకి దిగిన చిత్రం టక్కరి దొంగ.
టక్కరి దొంగ : 2002లో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా టక్కరి దొంగ. మహేష్ బాబు ఈ సినిమాలో కౌబాయ్ పాత్రలో కనిపిస్తాడు. అయితే ఈ సినిమా ఫ్లాప్ ని మూట కట్టుకొని మహేష్ కి నిరాశని మిగిల్చింది.
ఒక్కడు: 2003లో ఒక్కడు సినిమాని బరిలోకి దింపాడు మహేష్ బాబు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవటమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మైల్ స్టోన్ గా నిలిచింది.
Ads
మళ్లీ 9 సంవత్సరాల వరకు ఈ సంక్రాంతికి మహేష్ బాబు సినిమాని విడుదల చేయలేదు. మళ్లీ 2012లో సంక్రాంతి బరిలో దూకాడు.
బిజినెస్ మాన్ : 2012లో బిజినెస్ మాన్ తో సంక్రాంతి బరిలో దిగి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు : 2013 పండక్కి రిలీజ్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
వన్ నేనొక్కడినే : 2014లో సంక్రాంతి బరిలో వన్ నేనొక్కడినే అంటూ సంక్రాంతి బరిలో దూకాడు. అయితే ఈ సినిమా అతనికి ఊహించని డిజాస్టర్ ని మిగిల్చింది.
ఆపై మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత
సరిలేరు నీకెవ్వరూ: 2020లో సరిలేరు నీకెవ్వరూ సినిమాతో ఆరు సంవత్సరాల తర్వాత సంక్రాంతి కి రిలీజ్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
మళ్లీ ఇప్పుడు 2024 లో గుంటూరు కారం పేరుతో సంక్రాంతి పందాలకు కాలు దువ్వుతున్నారు మహేష్ బాబు. ఇది కూడా కొద్ది గంటలలో హిట్టో ఫ్లాపో తెలిసిపోతుంది