సైలెంట్ గా రిలీజ్ అయిన స్టార్ హీరో సినిమా..! ఎలా ఉందంటే..?

Ads

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన కొన్ని దశాబ్ధాలుగా మలయాళ పరిశ్రమను రూల్ చేస్తున్నాడు. ఆయన కుమారుడు హీరోగా మారిన తర్వాత కూడా మమ్ముట్టినే అక్కడ నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు.

Ads

మమ్ముట్టి ఇమేజ్‌తో పనిలేకుండా డిఫెరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ, ప్రయోగాలు చేస్తూ, ఎంచుకున్న కథలో ఆ పాత్రలో జీవిస్తున్నాడు. తాజాగా మమ్ముట్టి నటించిన ‘కాథల్ ది కోర్’ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
72 ఏళ్ళ వయసులోనూ మమ్ముట్టి ఏడాదికి మూడు నాలుగు చిత్రాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఆయన నటించిన మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇటీవల రిలీజ్ అయిన మూవీ ‘కన్నూర్ స్క్వాడ్’ సూపర్ హిట్ అయ్యింది. ఓటీటీలోనూ ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మమ్ముట్టి కాథల్ ది కోర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో తొలిసారిగా జ్యోతిక మమ్ముట్టితో కలిసి నటించింది. ఈ మూవీ తొలి షో నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఇక ఈమూవీ కథ విషయానికి వస్తే, కేరళలోని కొట్టాయం జిల్లాలోని పాలా పట్టణానికి సమీపంలోని టీకోయ్ అనే గ్రామంలో ఉండే మాథ్యూ (మమ్ముట్టి) ఓమన (జ్యోతిక) భార్యాభర్తలు. ఉద్యోగం నుండి రిటైర్‌ అయిన మాథ్యూ, గ్రామ పంచాయతీ ఎలెక్షన్స్ లో పోటీ చేయడానికి, నామినేషన్‌ వేస్తాడు. ఎన్నికల ప్రచారం మొదలు కాగానే, ఊహించని విధంగా ఓమన విడాకుల కోసం కోర్టుకు వెళ్తుంది. ఈ విషయం తెలియడంతో మాథ్యూతో పాటు అందరు షాక్‌ అవుతారు. మాథ్యూ స్వలింగ సంపర్కుడని చెప్పడంతో అందరు ఆశ్చర్యపోతారు.
అదే గ్రామంలో డ్రైవింగ్ స్కూల్ నడిపే ఫ్రెండ్ తో మాథ్యూకు సంబంధం ఉందని ఫిర్యాదులో ఓమన పేర్కొంటుంది. అయితే ఈ విషయం ఆమెకు ముందుగానే తెలిసినా, అప్పటివరకు మౌనంగా ఉండి, ఎన్నికల సమయంలో బయటపెడుతుంది. అయితే ఆమె అతను నేరం చేసినట్టుగా చెప్పడంలేదని, విడాకులు మాత్రమే అడుగుతున్నట్టుగా చెబుతుంది. మాథ్యూ ఓమన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ. ఈ మూవీకి నెట్టింట్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. క్రిటిక్స్ సైతం ఈ మూవీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: మెగా కోడలు ఉపాసన ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? రామ్ చరణ్ కంటే ఎక్కువ సంపాదించారా..?

Previous articleమెగా కోడలు ఉపాసన ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? రామ్ చరణ్ కంటే ఎక్కువ సంపాదించారా..?
Next articleIPL 2024: ఈసారి IPL లో చేయబోతున్న భారీ మార్పులు ఇవే..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.